కనీస మద్దతుధరపై చట్టం చేయండి, కేంద్రానికి రైతు సంఘం నేత రాకేష్ తికాయత్ సూచన

| Edited By: Pardhasaradhi Peri

Feb 08, 2021 | 2:26 PM

కనీస మద్దతుధరపై చట్టాన్ని తేవాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర (ఎం ఎస్ పీ) ఉంటుందని,..

కనీస మద్దతుధరపై చట్టం చేయండి, కేంద్రానికి రైతు సంఘం నేత రాకేష్ తికాయత్ సూచన
Follow us on

కనీస మద్దతుధరపై చట్టాన్ని తేవాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర (ఎం ఎస్ పీ) ఉంటుందని, ఇది కొనసాగుతుందని ప్రధాని మోదీ రాజ్యసభలో ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ధర లేదని తాము ఎప్పుడు అన్నామని ప్రశ్నించారు. తమ డిమాండ్ అల్లా వివాదాస్పద చట్టాలను రద్దు చేయాలన్నదే అని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరపై  ఓ చట్టం చేస్తే దేశ అన్నదాతలందరికీ ప్రయోజనం కలుగుతుందని, ప్రస్తుతం చట్టం లేదు గనుక వ్యాపారాలు రైతులను దోచుకుంటున్నారని ఆయన అన్నారు. అక్టోబరు 2 వరకు రైతుల ఆందోళన కొనసాగుతుందని ఈయన ఇదివరకే ప్రకటించారు.

ఈ దేశంలో దీక్షలతో వ్యాపారం జరగదని, ఆకలి పెరిగే కొద్దీ పంటల ధరలను ఆ ప్రకారం నిర్ణయిస్తుంటారని తికాయత్ పేర్కొన్నారు. ఆకలిపై బిజినెస్ చేసేవారిని దేశం నుంచి వెళ్ళగొడతామన్నారు. కాగా- రైతులు తమ ప్రతిపాదనలతో మళ్ళీ ప్రభుత్వంతో చర్చలకు రావాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ కోరారు. వారి డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిధ్ధంగా ఉంటుందన్నారు.