aha vyuham trailer out: లాక్‌డౌన్ సమయంలో థియేటర్లు మూతపడడంతో ఓటీటీలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. నిర్మాతలు కూడా నేరుగా ఓటీటీలో సినిమాలను విడుదల చేస్తుండడంతో ఓటీటీ మార్కెట్ పెరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో సస్పెన్స్ థ్రిల్లర్ ఓటీటీ వేదికగా విడుదల కానుంది. టొవినో థామస్, నిమిషా, అను సితార నటీనటులుగా తెరకెక్కిన ‘వ్యూహం’ చిత్రం కిస్మస్ కానుకగా ఈ నెల 25న ‘ఆహా’ ఓటీటీ వేదికగా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ అద్యంతం సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఆకట్టుకుంటోంది. ‘ఒక క్రిమినల్‌ను కాపాడే మిషన్‌లో ఉన్న వాడితో’, ‘పోలీసులు ఇంటికి వచ్చి అడిగారు నువ్వు ఏం చేశావని’ లాంటి డైలాగ్‌లు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక ‘కోర్టులో నిజం మాత్రమే చెప్పాలి.. నేను అలా చెప్పలేను’ అన్న సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ ఏంటా నిజం.? అసలు ఏం జరిగిందనేది తెలుసుకోవాలంటే ‘వ్యూహా’న్ని చూడాల్సిందే.