టిక్ టాక్ మోజులో మహిళా ఖాకీలు.. ఇదేం పనంటూ నెటిజన్లు ఫైర్..

| Edited By:

Jul 27, 2019 | 11:51 AM

స్టూడెంట్లు, డాక్టర్లు, పోలీసులలే కాదు అందరూ టిక్ టాక్‌కి అడిక్ట్ అయిపోతున్నారు. విధులను మరిచి కొందరు, చదువును మరిచి మరికొందరు పోటీ పడుతూ టిక్ టాక్‌లు చేసేస్తున్నారు. అయితే ఎందరో యువకుల ప్రాణాలు పోవడానికి, చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకుని రోడ్డున పడటానికి ఈ టిక్ టాక్ కారణమైంది. ఇవన్నీ చూసినా కొందరు దాని మోజులో పడి జీవితాన్ని రిస్క్‌లో పడేసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వారు విధులు పక్కన పెట్టి టిక్ టాక్ వీడియోలతోనే కాలం గడుపుతున్నారు. […]

టిక్ టాక్ మోజులో మహిళా ఖాకీలు.. ఇదేం పనంటూ నెటిజన్లు ఫైర్..
Follow us on

స్టూడెంట్లు, డాక్టర్లు, పోలీసులలే కాదు అందరూ టిక్ టాక్‌కి అడిక్ట్ అయిపోతున్నారు. విధులను మరిచి కొందరు, చదువును మరిచి మరికొందరు పోటీ పడుతూ టిక్ టాక్‌లు చేసేస్తున్నారు. అయితే ఎందరో యువకుల ప్రాణాలు పోవడానికి, చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకుని రోడ్డున పడటానికి ఈ టిక్ టాక్ కారణమైంది. ఇవన్నీ చూసినా కొందరు దాని మోజులో పడి జీవితాన్ని రిస్క్‌లో పడేసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వారు విధులు పక్కన పెట్టి టిక్ టాక్ వీడియోలతోనే కాలం గడుపుతున్నారు. రెండు రోజుల క్రితం గుజరాత్‌లో అర్పితా అనే మహిళా పోలీసు బాలీవుడ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసి సస్పెన్షన్‌కు గురైంది.

ఇప్పుడది తెలుగు రాష్ట్రాలకు పాకింది. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు జూనియర్ డాక్టర్లు కూడా ఇదే మోజులో పడి ఇంటి దారి పట్టారు. ఇక తాజాగా విశాఖలో మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ టీమ్ వంటి శక్తి టీమ్‌ కూడా టిక్ టాక్ కు బానిసైనట్లు కనిపిస్తోంది. యూనిఫామ్ ఉందన్న విషయాన్ని కూడా మరిచి.. ఈ టిమ్ లోని ఇద్దరు సభ్యులు టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. డ్యూటీ టైమ్‌లో సినిమా డైలాగులు, జబర్దస్త్ కామెడీలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. విధులను గాలికి వదిలేసి.. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు మండిపడుతున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.