రోహిత్‌ టీమిండియా కెప్టెన్‌ కాకుంటే అది జట్టుకే నష్టం…!

|

Nov 11, 2020 | 4:37 PM

రోహిత్‌శర్మ టీమిండియాకు కెప్టెన్‌ కాకపోతే అది జట్టుకే నష్టమని మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు..లిమిటెడ్‌ ఓవర్ల మ్యాచ్‌లకు రోహిత్‌ను కెప్టెన్‌గా చేయాలని డిమాండ్‌ చేశాడు.. అలా చేయకపోతే అది టీమిండియాకే సిగ్గుచేటంటూ వ్యాఖ్యానించాడు. జట్టు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో కెప్టెన్‌ కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉండాలన్న గౌతమ్‌ గంభీర్‌ ఓ కెప్టెన్‌ గొప్పవాడా? కాదా? అన్నది ఎలా నిర్ణయిస్తామని ప్రశ్నించాడు.. దాంతోపాటే ఆ నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలంటూ సూచన చేశాడు.. అయిదుసార్లు ముంబాయి ఇండియన్స్‌ […]

రోహిత్‌ టీమిండియా కెప్టెన్‌ కాకుంటే అది జట్టుకే నష్టం...!
Follow us on

రోహిత్‌శర్మ టీమిండియాకు కెప్టెన్‌ కాకపోతే అది జట్టుకే నష్టమని మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు..లిమిటెడ్‌ ఓవర్ల మ్యాచ్‌లకు రోహిత్‌ను కెప్టెన్‌గా చేయాలని డిమాండ్‌ చేశాడు.. అలా చేయకపోతే అది టీమిండియాకే సిగ్గుచేటంటూ వ్యాఖ్యానించాడు. జట్టు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో కెప్టెన్‌ కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉండాలన్న గౌతమ్‌ గంభీర్‌ ఓ కెప్టెన్‌ గొప్పవాడా? కాదా? అన్నది ఎలా నిర్ణయిస్తామని ప్రశ్నించాడు.. దాంతోపాటే ఆ నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలంటూ సూచన చేశాడు.. అయిదుసార్లు ముంబాయి ఇండియన్స్‌ టీమ్‌కు ఐపీఎల్‌ ట్రోఫీని అందించిన రోహిత్‌ను బెస్ట్‌ కెప్టెన్‌ కాకుండా ఎలా ఉంటాడన్నాడు గంభీర్‌. ధోనీని అత్యుత్తమ కెప్టెన్‌ అని ఎందుకంటామంటే రెండు ప్రపంచకప్‌లు, మూడు ఐపీఎల్‌ ట్రోఫీలు గెలిచాడు కాబట్టి.. మరి రోహిత్‌ కూడా అయిదు ఐపీఎల్‌ టైటిల్స్‌ గెలిచాడు కదా అని గంభీర్‌ అడుగుతున్నాడు. ఇంతకన్నా రోహిత్‌ నిరూపించుకోడానికి ఏముంటుందని అని ప్రశ్నించాడు. అయితే తాను విరాట్‌ కోహ్లీని తక్కువ చేయడం లేదని, మిగతా దేశాలు అనుసరిస్తున్న ఇద్దరు కెప్టెన్ల వ్యూహం ఇక్కడా పని చేస్తుందని మాత్రమే చెబుతున్నానని గంభీర్‌ అన్నాడు. వైట్‌బాల్‌ క్రికెట్‌లో కోహ్లీ కంటే తాను బెటర్‌ కెప్టెన్‌ అని రోహిత్‌ రుజువు చేసుకున్నాడని చెప్పాడు. ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రోహిత్‌శర్మకు టీమిండియా టీ-20 కెప్టెన్‌ పదవి ఇవ్వాలని అన్నాడు.