Viral Video: భార్యకు క‌రోనా పాజిటివ్.. భ‌ర్త ఏం చేశాడో మీరే చూడండి

|

Jun 02, 2021 | 9:57 AM

ఓ వ్య‌క్తి.. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన త‌న భార్య‌ను ఐసోలేషన్​ సెంట‌ర్‌కు తీసుకెళ్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో...

Viral Video: భార్యకు క‌రోనా పాజిటివ్.. భ‌ర్త ఏం చేశాడో మీరే చూడండి
Innovative Social Distance
Follow us on

ఓ వ్య‌క్తి.. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన త‌న భార్య‌ను ఐసోలేషన్​ సెంట‌ర్‌కు తీసుకెళ్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో తెగ స‌ర్కులేట్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే .. మిజోరాంకు చెందిన ఓ మ‌హిళ‌కు క‌రోనా సోకింది. దీంతో ఆమెను ఐసోలేష‌న్ సెంట‌ర్‌కు త‌ర‌లించాల్సి వ‌చ్చింది. అయితే క‌రోనా అంటువ్యాధి కాబ‌ట్టి అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం. అజాగ్ర‌త్తగా ఉంటే.. వ్యాధి వ్యాప్తి చెందే ప్ర‌మాదం ఉంది. దీంతో అత‌డు మెద‌డుకు ప‌ద‌ను పెట్టాడు. క్రేజీ ఐడియాతో రోడ్డుమీద‌కొచ్చాడు. అతని జీప్‌​కు, వెనుకల ఒక చిన్న ట్రాలీని ఏర్పాటు చేశాడు. అందులో ఆమెను ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టి.. ఐసోలేష‌న్ సెంట‌ర్‌కు త‌ర‌లించాడు. ఈ వీడియోను ఐపీఎస్​ అధికారి రిపున్​ శర్మ సోషల్​ మీడియా వేదికగా పోస్ట్​ చేయ‌గా.. తెగ ట్రెండ్ అవుతుంది.  వైరల్​గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు భిన్న ర‌కాలుగా స్పందిస్తున్నారు. ‘వావ్​.. మీ భార్య చాలా ల‌క్కీ’, ‘ మీ తెలివి అదుర్స్​’, అంటూ కొంద‌రు కామెంట్లు పెట్ట‌గా.. ‘మ‌రీ అంత జాగ్ర‌త్త ఎందుకు పీపీఈ కిట్ అందిస్తే.. ఆమెను నార్మ‌ల్‌గా తీసుకెళ్లెచ్చు. అలా ప‌బ్లిక్‌గా ఏంటి’.. అంటూ మ‌రో నెటిజ‌న్ కామెంట్ పెట్టాడు.  మిజోరాంలో వైరస్​ ఉధృతి కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 3,144 కేసులు యాక్టివ్​ గా ఉన్నాయని ఉండ‌గా.. ఇప్పటి వరకు 9,214 మంది ఈ మహమ్మారి బారినుంచి కోలుకున్నారు.

Also Read:  జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం.. అనాథ పిల్ల‌ల‌కు బీమా ఉన్నా రూ. 10 లక్షల పరిహారం

మ‌రో టెన్ష‌న్… ‘స్కిన్​ బ్లాక్​ ఫంగస్​’…. దేశంలో ఫ‌స్ట్ కేసు న‌మోదు..