Viral Video: శ్రీవల్లి సాంగ్ ఛాలెంజ్ లో చిన్నారి.. అల్లు అర్జున్ హుక్ స్టెప్‌ను రీక్రియేట్ చేసిన చిన్నారి వీడియో వైరల్..

|

Feb 04, 2022 | 9:00 PM

Viral Video: యూత్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) , రష్మిక మందన్న(Rashmika Mandanna )హీరో హీరోయిన్లుగా నటించిన పుష్ప.. ది రైజ్(Pushpa: The Rise )సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది..

Viral Video: శ్రీవల్లి సాంగ్ ఛాలెంజ్ లో చిన్నారి.. అల్లు అర్జున్ హుక్ స్టెప్‌ను రీక్రియేట్ చేసిన చిన్నారి వీడియో వైరల్..
Srinvalli Song
Follow us on

Viral Video: యూత్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) , రష్మిక మందన్న(Rashmika Mandanna )హీరో హీరోయిన్లుగా నటించిన పుష్ప.. ది రైజ్(Pushpa: The Rise )సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ సామాన్యుల నుంచి సెలబ్రేటి సహా అందరినీ ఆకట్టుకున్నాయి. తెలుగు వారు మాత్రమే కాదు.. దేశవిదేశాల్లోని యూత్ సాంగ్స్ ను అనుకరిస్తూ… వీడియోలు షేర్ చేస్తున్నారు. చిన్న పెద్ద, ఆడ, మగ, అనే తేడా లేకుండా ఈ సినిమాలోని సన్నివేశాలను ఇమిటేట్ చేస్తూ.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఇప్పట్లో తగ్గే అవకాశం లేదంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీవల్లి ఛాలెంజ్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ ఛాలెంజ్ లో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ పాల్గొంటున్నారు. ఇప్పుడు శ్రీవల్లి పాటకు అల్లు అర్జున్ స్టెప్పులను అనుకరిస్తున్న ఓ చిన్నారి వీడియో వైరల్‌గా మారింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆ చిన్నారి అల్లు అర్జున్ హుక్ స్టెప్‌ను రీక్రియేట్ చేస్తోంది. ఆ చిన్నారి అల్లు అర్జున్ లా సేమ్ గీతాల షర్ట్, అదే రంగు ఫ్యాంటును ధరించి. LCD టెలివిజన్‌లో ప్లే అవుతున్న శ్రీవల్లి పాటను అల్లు అర్జున్ ను అనుకరిస్తూ.. డ్యాన్స్ చేసింది. ఆ చిన్నారి డ్యాన్స్ .. ఫీలింగ్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఈ వీడియోకు, ””కాజ్ ఇట్స్ ట్రెండింగ్” అని క్యాప్షన్ తో షేర్ చేశారు.

ఈ వీడియో వైరల్‌గా మారింది . ప్రజలు తానియా డ్యాన్స్ ను ఇష్టపడుతున్నారు. చాలా మంది లవ్ ఎమోజీల రూపంలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా, తానియా ,ఆమె తల్లి సోనీ ఇన్‌స్టాగ్రామ్‌కి మొత్తం 108 K ఫాలోవర్లున్నారు. ఇద్దరూ తరచుగా తమ డ్యాన్స్ వీడియోలను తమ ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేస్తుంటారు.

Also Read: . ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కళ్ళు తెరవాలి.. జిన్నా వారసత్వాన్ని కొనసాగిస్తే ఒప్పుకోము: ఎంపీ జీవీఎల్