Video Viral: గంటకు 414 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన బుగాటీ కారు.. నెట్టింట వీడియో వైరల్‌

Viral Video: అతి వేగం ప్రమాదకరం అని ఎంత చెప్పినా కొందరు పట్టించుకోరు.. సోషల్‌ మీడియా (Social Media)లో పాపులర్‌ అవ్వాలని ఇటీవల చాలామంది రకరకాల స్టంట్స్‌ చేస్తున్నారు. అలాంటి వీడియో (Video) ఒకటి..

Video Viral: గంటకు 414 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన బుగాటీ కారు.. నెట్టింట వీడియో వైరల్‌
Viral Video

Updated on: Jan 22, 2022 | 1:15 PM

Viral Video: అతి వేగం ప్రమాదకరం అని ఎంత చెప్పినా కొందరు పట్టించుకోరు.. సోషల్‌ మీడియా (Social Media)లో పాపులర్‌ అవ్వాలని ఇటీవల చాలామంది రకరకాల స్టంట్స్‌ చేస్తున్నారు. అలాంటి వీడియో (Video) ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. జర్మనీలోని A2 ఆటోబాన్ అని పిలిచే హైవేపై ఏకంగా 414 కి.మీ. వేగంతో కారులో దూసుకుపోయాడు రాడిమ్ అనే వ్యక్తి. ఈ రోడ్డు బెర్లిన్, హన్నోవర్ మధ్య ఉంటుంది. ఇందుకు సంబంధించిన వీడియోని జనవరి 9న రాడిమ్ తన యూట్యూబ్ ఛానెల్ Radim Passerలో అప్ లోడ్ చేశాడు. గంటకు 414 కి.మీ. వేగంతో వెళ్లినట్లు చెప్పాడు. ఈ స్టంట్ గతేడాది చేసిందట. మూడు లేన్ల రోడ్డుపై 10 కిలోమీటర్ల ప్రయాణంలో గరిష్ట వేగం గంటకు 414 కిలో మీటర్లుగా వీడియోలో రికార్డ్ అయ్యింది. ఈ కారు రోడ్డుపై వెళ్తూ… గాల్లో తేలుతున్నట్లు దూసుకుపోయింది. పక్కనే వెళ్తున్న చాలా వాహనాల్ని ఇది ఓవర్ టేక్ చేసింది. ఈ వీడియో ఎంతగా వైరల్ అయ్యిందంటే… దీనిపై స్వయంగా జర్మనీ రవాణా మంత్రిత్వ శాఖ సీరియస్ అవ్వాల్సి వచ్చింది. జర్మనీలోని ఆటోబాన్ నెట్ వర్క్‌లో స్పీడ్ లిమిట్ లేదు. కానీ ఈ వీడియో చూసిన ప్రభుత్వ రవాణా శాఖ జనవరి 20న ఓ స్టేట్ మెంట్ రిలీజ్ చేసింది. “ఇలాంటి చర్యల్ని రోడ్లపై వ్యతిరేకిస్తున్నాం. ఇలాంటివి రోడ్డుపై వెళ్లే ఇతర ప్రయాణికులకు ప్రమాదకరం. ప్రతి ఒక్కరూ రోడ్ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఇతరులకు హాని కలగకుండా వ్యవహరించాలి” అంటూ ప్రకటనలో తెలిపింది.

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. “నేను ఆశ్చర్యపోతున్నాను. మన పక్క నుంచి ఇంత వేగంతో బుగాటీ వెళ్తే ఎలా ఉంటుంది” అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా… “ఎవరైనా ఆ బ్రిడ్జిపై ఉంటే… కిందనుంచి బుగాటీ ఇంత వేగంతో వెళ్తే… బ్రిడ్జిపై ఉన్న వారికి హార్ట్ ఎటాక్ రావడం ఖాయం” అంటూ మరో యూజర్ స్పందించారు.

 

Also Read:

మీకు ఆ హక్కు లేదంటూ ఓటీఎస్ వసూలుపై సీఎం జగన్ కు ముద్రగడ ఘాటు లేఖ..