AP Local Body Elections: ఏపీలో ఎన్నికల కోడ్ అమలు.. కొన్నిచోట్ల పట్టించుకోని అధికారులు.. స్వయంగా తహసీల్దార్ ఇళ్లపట్టాల పంపిణీ

|

Jan 31, 2021 | 9:17 AM

ఏపీలో వైపు మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. అయినా కొన్ని ప్రాంతాల్లో అధికారులు ఎన్నికల కోడ్ ను పట్టించుకోవడం..

AP Local Body Elections: ఏపీలో ఎన్నికల కోడ్ అమలు.. కొన్నిచోట్ల పట్టించుకోని అధికారులు.. స్వయంగా తహసీల్దార్ ఇళ్లపట్టాల పంపిణీ
Follow us on

AP Local Body Elections: ఏపీలో వైపు మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. అయినా కొన్ని ప్రాంతాల్లో అధికారులు ఎన్నికల కోడ్ ను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. తాజాగా విశాఖ జిల్లా మునగపాక మండలంలో ఎన్నికల కోడ్‌ నిబంధనలను ఉల్లంఘించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. తహసీల్దార్‌ కార్యాలయంలోనే ఇదంతా జరగడంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు.

మరోవైపు తొలి దశ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ తో ముగియనుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకూ అభ్యర్ధ్యులు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. ఈ నేపథ్యంలో కొన్నిచోట్ల ఉద్రిక్తతల నడుమ నామినేషన్లు కొనసాగుతున్నాయి.

Also Read: నేటితో ముగియనున్న తొలిదశ నామినేషన్ల పర్వం.. ఉపసంహరణకు ఫిబ్రవరి 4 తుది గడువు