Vijayawada Fire Incident: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటనలో కీలక విషయాలను ఇన్వెస్టిగేషన్ అఫీసర్ ఏసీపీ సూర్యచంద్రరావు వెల్లడించారు. ఇప్పటికే ఈ ఘటనలో 10 మందికి నోటీసులు ఇచ్చామని చెప్పిన ఆయన.. డాక్టర్ మమత నుంచి కీలక అంశాలు రాబట్టామని పేర్కొన్నారు. అటు కోవిడ్ పేషెంట్ల నుంచి అధిక ఫీజులు వసూలు చేశారని వస్తున్న ఆరోపణలపైనా విచారణ కొనసాగుతోందని సూర్యచంద్రరావు తెలిపారు.
కాగా, రిమాండ్ లో ఉన్న ముగ్గురిని పోలీస్ కస్టడీ కోరుతూ పిటిషన్ వేశామని ఆయన అన్నారు. సోమవారానికి విచారణ వాయిదా పడింది. వారిని కస్టడీకి తీసుకుని వారి నుంచి సేకరించాల్సిన వివరాలు చాలా ఉన్నాయన్నారు. ఇక నోటీసులు అందుకున్న వారంతా విచారణకు సహకరిస్తారని భావిస్తున్నాం. ఒకవేళ ఎవరైనా విచారణకు సహకరించకపోతే సెక్షన్ 171 ప్రకారం అరెస్టు చేసే అధికారం మాకుందని ఇన్వెస్టిగేషన్ అఫీసర్ ఏసీపీ సూర్యచంద్రరావు స్పష్టం చేశారు.
Also Read:
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’..