వచ్చేవారం విజయవాడ-చెన్నై మధ్య విమాన సర్వీసు

|

Sep 04, 2020 | 11:50 AM

కరోనా కారణంగా నాలుగు నెలలుగా విజయవాడ నుంచి చెన్నైకు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈనెల రెండో వారం నుంచి తిరిగి పునరుద్ధరించేందుకు అధికారులు ఫ్లాన్ చేస్తున్నారు. ఇటీవల విమానాల రాకపోకల సంఖ్యను 45 నుంచి 65 శాతానికి పెంచుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.

వచ్చేవారం విజయవాడ-చెన్నై మధ్య విమాన సర్వీసు
Follow us on

కరోనా ప్రభావంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే తెరుకుంటుంది. చతికిలాపడ్డ వర్తక, వాణిజ్యం గాడిలో పడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆన్ లాక్ 4.0 లో భాగంగా రవాణా వ్యవస్థకు అనుమతుల ఇవ్వడంతో.. దుమ్ముపట్టిన వాహనాలను దులుపుతున్నారు. ఇందులో భాగంగా కరోనా కారణంగా నాలుగు నెలలుగా విజయవాడ నుంచి చెన్నైకు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈనెల రెండో వారం నుంచి తిరిగి పునరుద్ధరించేందుకు అధికారులు ఫ్లాన్ చేస్తున్నారు. ఇటీవల విమానాల రాకపోకల సంఖ్యను 45 నుంచి 65 శాతానికి పెంచుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ఇందుకు అనుగుణంగా విమానాల సంఖ్యను పెంచాలని నిర్ణయించింంది. కాగా, విజయవాడ-చెన్నై విమానాలు నడవటానికి రంగం సిద్ధమైంది. ఈనెల 8వ తేదీన చెన్నైకు తొలి విమానం మొదలుకానుంది. ప్రస్తుతం విజయవాడ విమానాశ్రయం నుంచి 9 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. బెంగళూరుకు నాలుగు, హైదరాబాద్‌కు నాలుగు, వారంలో రెండు రోజుల పాటు ఢిల్లీకి ఒక విమానం నడుస్తున్నాయి. తాజాగా చెన్నైకు ఒక విమానంతో పాటు హైదరాబాద్‌కు మరో విమానానికి అవకాశం ఇవ్వటంతో ఆ సంఖ్య 11కు చేరుకుంది. చెన్నై కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో విమాన సర్వీసులను రద్దు చేశారు. తాజా నిర్ణయంతో వచ్చే వారం ఓ సర్వీసును ప్రయోగాత్మకంగా నడపాలని అధికారులు భావిస్తున్నారు.