విజయవాడ పోలీసుల‌ వెరైటీ పనిష్మెంట్..లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే

| Edited By: Pardhasaradhi Peri

Apr 22, 2020 | 5:48 PM

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా ఏపీలో లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. పోలీసులు అనేక క‌ష్ట‌న‌ష్టాల‌కోర్చి విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ఈ క్ర‌మంలో రోడ్ల‌పైకి రావొద్ద‌ని పోలీసులు ఎంత హెచ్చ‌రించినా కొంద‌రు వారి మాట‌ల విన‌డం లేదు. ఫ‌స్ట్ దండం పెట్టారు..త‌ర్వాత లాఠీ పట్టారు..అయినా కొంద‌రు ఆక‌తాయిల్లో నో ఛేంజ్. వినూత్న రీతిలో అవ‌గాహ‌న క‌ల్పిస్తోన్నా కూడా అవ‌న్నీ బూడిద‌లో పోసిన ప‌న్నీరే అవుతున్నాయి. ఈ క్ర‌మంలో విసిగిపోయిన పోలీసులు త‌మ స్టైల్ మార్చారు. ఊహించని ప‌నిష్మెంట్స్ తో రోడ్డెక్కాలంటే వ‌ణుకుపుట్టేలా […]

విజయవాడ పోలీసుల‌ వెరైటీ పనిష్మెంట్..లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే
Follow us on

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా ఏపీలో లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. పోలీసులు అనేక క‌ష్ట‌న‌ష్టాల‌కోర్చి విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ఈ క్ర‌మంలో రోడ్ల‌పైకి రావొద్ద‌ని పోలీసులు ఎంత హెచ్చ‌రించినా కొంద‌రు వారి మాట‌ల విన‌డం లేదు. ఫ‌స్ట్ దండం పెట్టారు..త‌ర్వాత లాఠీ పట్టారు..అయినా కొంద‌రు ఆక‌తాయిల్లో నో ఛేంజ్. వినూత్న రీతిలో అవ‌గాహ‌న క‌ల్పిస్తోన్నా కూడా అవ‌న్నీ బూడిద‌లో పోసిన ప‌న్నీరే అవుతున్నాయి. ఈ క్ర‌మంలో విసిగిపోయిన పోలీసులు త‌మ స్టైల్ మార్చారు. ఊహించని ప‌నిష్మెంట్స్ తో రోడ్డెక్కాలంటే వ‌ణుకుపుట్టేలా డిఫ‌రెంట్ రూట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ కోవ‌లో ముందు వ‌ర‌స‌లో ఉన్నారు విజ‌యవాడ పోలీసులు.

ఎవరైనా త‌గిన కారణం లేకుండా రోడ్లుపైకి వస్తే వారిని పోలీసులు సున్నీతంగా ద‌గ్గ‌ర‌కు పిలుస్తున్నారు. వాళ్లకు వైట్ పేపర్లు, పెన్ చేతిలో పెడుతున్నారు. ఆ పేపర్‌పై ‘తప్పైపోయింది సార్ క్షమించండి’ అనే పదాన్ని ఓ 500 సార్లు రాసి తర్వాత అక్క‌డ్నుంచి క‌ద‌లమ‌ని చెబుతున్నారు. పోలీసుల వెరైటీ పనిష్మెంట్ దెబ్బకు వాహనదారులకు షాక్ కి గుర‌వుతున్నారు. ఒక వంద ఫైన్..ఒక లాఠీ దెబ్బ అయితే ఓకే గానీ…ఇలా 500 సార్లు రాయ‌మ‌నేస‌రికి విసుగుపుట్టి భ‌గ‌వంతుడా ఇంకోసారి రోడ్డెక్క‌మ‌ని పోలీసుల‌ను ప్రాధేయ‌ప‌డుతున్నారు.