సుశాంత్ కేసు విచారణపై విజయశాంతి రియాక్షన్

|

Sep 04, 2020 | 2:55 PM

బాలీవుడ్ యువహీరో సుశాంత్ రాజ్‌పుత్ కేసును సీబీఐ విచారించడం హర్షణీయమని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌ పర్సన్‌ విజయశాంతి అన్నారు. సుశాంత్‌ కేసులో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు...

సుశాంత్ కేసు విచారణపై విజయశాంతి రియాక్షన్
Follow us on

బాలీవుడ్ యువహీరో సుశాంత్ రాజ్‌పుత్ కేసును సీబీఐ విచారించడం హర్షణీయమని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌ పర్సన్‌ విజయశాంతి అన్నారు. సుశాంత్‌ కేసులో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. అయితే సీబీఐ ఆధారాలు సమర్పించినా శిక్షలు తక్కువగానే పడుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

సినీరంగంలో  గతంలో ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకుని ఎందరో నటీమణులు బలవన్మరణాలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. వారిలో ఒక్కరి ఆత్మకైనా శాంతి కలిగించేలా ఈ స్థాయిలో విచారణలు… దర్యాప్తులు జరిగాయా అని ప్రశ్నించారు. చాలామంది నటీమణులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినప్పుడు నామమాత్రంగా కేసులు నమోదు కావడం, తూతూ మంత్రంగా విచారణ చేసి చివరకి మమ అనిపించడమే చూశామని అభిప్రాయపడ్డారు.

మరోవైపు సుశాంత్‌ కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో అనుమానం ఉన్న వారిని విచారిస్తోంది. సుశాంత్‌ మేనేజర్‌, వంట మనిషితో పాటు అతని స్నేహితులను విచారిస్తోంది. తాజాగా సుశాంత్‌ డ్రగ్స్‌ తీసుకుంటాడని ఆరోపణలు చేసిన రియా చక్రవర్తి ఇంట్లో సోదాలు జరిపారు ఎన్‌సీబీ అధికారులు. అటు ఇప్పటికే సీబీఐ అధికారులు, రియాతో పాటు ఆమె పేరెంట్స్‌కు కూడా విచారించారు.