అమ్మాయిల ఫొటోలతో వ్యాపారం.. 60 లక్షలకు టోకరా..

సెక్స్‌ పేరిట ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుల నుంచి వీరు 60 లక్షలకు పైగా డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు.

అమ్మాయిల ఫొటోలతో వ్యాపారం.. 60 లక్షలకు టోకరా..

Updated on: Aug 17, 2020 | 6:34 PM

Online Honey Trap: సెక్స్‌ పేరిట ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుల నుంచి వీరు 60 లక్షలకు పైగా డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు. ఇంటర్నెట్‌ వేదికగా అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టి, వారితో మాట్లాడించి.. సుమారు 3 వేల మందికి వీరిరువురూ టోకరా వేసినట్లు పోలీసులు వెల్లడించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం దెబ్బతినడంతో నిందితులు ఈ ఆన్‌లైన్‌ హనీట్రాప్‌కు తెరలేపినట్లు చెప్పారు. ఓ NRI ఫిర్యాదుతో ఈ తతంగం మొత్తం వెలుగులోకి వచ్చింది. దీంతో అశ్విన్‌, సింధులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళ్తే..

కొంతకాలం కిత్రం అశ్విన్ అనే వ్యక్తి బతుకుదెరువు కోసం విజయనగరం వచ్చి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో సింధూ అనే యువతితో అతడికి పరిచయం అయ్యింది. మొదటి భార్య, పిల్లలతో పాటుగా ప్రేయసిని పోషించడం అశ్విన్‌కు కష్టమైంది. దీంతో ఆన్‌లైన్‌ సెక్స్ పేరుతో బిజినెస్‌ను ప్రారంభించారు. కస్టమర్లతో మాట్లాడటం, వారి స్థాయిని బట్టి 500 నుంచి 8 వేల రూపాయల వరకు ఛార్జ్ చేసేవాడు. ఆన్‌లైన్‌లోనే తన అకౌంట్‌కి డబ్బులను ట్రాన్స్‌ఫర్‌ చేయించుకునేవాడు.

డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ అయిన తరువాత ఫోన్ స్విచ్‌ ఆఫ్‌ చేసేవాడు. అశ్విన్‌ గత మూడేళ్లుగా లొకాంటో యాప్ ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తున్నాడు. ఇలా నెలకు 25 వేల రూపాయల వరకు దండుకునేవాడు. అమెరికా నుంచి నరేశ్‌ రెడ్డి అనే వ్యక్తి ఆన్‌లైన్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అశ్విన్‌ గుట్టురట్టయింది. పోలీసులు అశ్విన్‌తో పాటు అతడి ప్రేయసి సింధూను కూడా అదుపులోకి తీసుకున్నారు.

Also Read:

కరోనాపై షాకింగ్ న్యూస్.. వైరస్ ఒకటి కాదు.. 73 రకాలు.!

తెలంగాణ: కరోనా బాధితులకు ప్రత్యేక ఎగ్జామ్ సెంటర్లు.. చివరి రోజు ఎంసెట్.!

‘కుట్రదారులకు శిక్ష తప్పదు’: హీరో రామ్

ఇకపై గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేయాలంటే.. అది తప్పనిసరి.!

ధోని అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్…

‘రనౌట్’తో కెరీర్ ప్రారంభం.. అదే రిటైర్మెంట్‌కు కారణం..!

వరుసగా నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్..

భారత యువత టార్గెట్‌గా చైనా కుట్ర.. చేధించిన హైదరాబాద్ పోలీసులు..