విశాఖ శారదాపీఠంలో విజయదుర్గగా రాజశ్యామల

విశాఖ శ్రీ శారదాపీఠంలో విజయదశమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పీఠం అధిష్టాన దేవత రాజశ్యామల అమ్మవారు దసరా పర్వదినాన విజయదుర్గ అవతారంలో దర్శనమిచ్చారు. ఆయుధాలు చేతపట్టి పులి వాహనంపై ఆశీనులైన అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. విజయదుర్గ అవతారంలో ఉన్న అమ్మవారి అవతారానికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి హారతులిచ్చారు. అనంతరం రాజ శ్యామల అమ్మవారి ఆలయంలో పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.

విశాఖ శారదాపీఠంలో విజయదుర్గగా రాజశ్యామల

Updated on: Oct 25, 2020 | 11:28 AM