‘రౌడీ’ హీరోపై విమర్శ.. తమ్ముడి స్ట్రాంగ్ కౌంటర్.!

'రౌడీ' హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుత రాజకీయ, ఎన్నికల వ్యవస్థపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీనిపై బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య..

రౌడీ హీరోపై విమర్శ.. తమ్ముడి స్ట్రాంగ్ కౌంటర్.!

Updated on: Oct 13, 2020 | 2:54 PM

Vijay Deverakonda’s Brother Anand Hits Back at Gulshan Devaiah: ‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుత రాజకీయ, ఎన్నికల వ్యవస్థపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ధనికులకు, పేదవాళ్లకు, లిక్కర్ తీసుకొని ఓటు వేసే వాళ్లకు ఓటు హక్కు ఉండొద్దని విజయ్ చేసిన వ్యాఖ్యలు కొంతమంది సెలబ్రిటీల మనోభావాలను దెబ్బ తీసినట్లు కనిపిస్తున్నాయి.

దేశంలోని ప్రతీ ఒక్కరిని ఓటు వేయడానికి అనుమతించకూడదని.. తాను నియంతృత్వాన్ని నమ్ముతున్నానని విజయ్ పై వీడియోలో పేర్కొన్నాడు. దీనిపై బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య స్పందిస్తూ విజయ్‌ను విమర్శించాడు. ‘తలలో ఒత్తిడిని తగ్గించడానికి మీకో హెయిర్ కట్ సూచిస్తాను’ అంటూ కామెంట్ చేశాడు.

ఆ కామెంట్‌కు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ స్పందిస్తూ గుల్షన్ దేవయ్యకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ”సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేసే ముందు ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో అర్ధం చేసుకోవాలని” ఆనంద్ రిప్లై చేశాడు. అయితే చివరికి గుల్షన్ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని.. క్షమాపణలు కోరుతున్నట్లు ట్వీట్ చేశాడు.