మన ఆయుర్వేదంపై పరిశోధనలు జరగాలి…

అపారమైన జ్ఞానానికి ప్రతీక అయిన భారతీయ ఆయుర్వేదం సమగ్ర వైద్యవిధానమే కాకుండా భారతీయుల జీవన విధానమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.  ఈ జ్ఞానాన్ని వినియోగించుకుని వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవడం ద్వారా కరోనా మహమ్మారిని నివారించడంపై మరిన్ని ప్రయోగాలు జరగాల్సిన అవసరమున్నదని ఆయన సూచించారు...

మన ఆయుర్వేదంపై పరిశోధనలు జరగాలి...

Updated on: Sep 15, 2020 | 7:09 PM

అపారమైన జ్ఞానానికి ప్రతీక అయిన భారతీయ ఆయుర్వేదం సమగ్ర వైద్యవిధానమే కాకుండా భారతీయుల జీవన విధానమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.  ఈ జ్ఞానాన్ని వినియోగించుకుని వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవడం ద్వారా కరోనా మహమ్మారిని నివారించడంపై మరిన్ని ప్రయోగాలు జరగాల్సిన అవసరమున్నదని ఆయన సూచించారు. వ్యాధినిరోధకతకు ఆయుర్వేదం ఇతివృత్తంతో సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ ఆయుర్వేద సదస్సును ఆన్ లైన్ ద్వారా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.

ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు.. సహజంగా అందుబాటులో ఉండే వస్తువులతోనే అద్భుతమైన వైరస్‌తో పోరాడే శక్తిని ఆయుర్వేదం అందిస్తుందని అన్నారు. ‘ఆయుర్వేదం.. మానవుడిని కూడా ప్రకృతిలో ఓ అభిన్న అంగంగానే భావిస్తుందని, అందుకే మానవుడికి వచ్చే సమస్యలకు తన చుట్టూ ఉన్న ప్రకృతిసిద్ధమైన మందులతోనే తగ్గిస్తుందని, అదే ఆయుర్వేదం ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నారు.

ఆయుర్వేద ప్రాశస్త్యం ఇలాగే కొనసాగేందుకు ప్రైవేటు కంపెనీలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తూ.. కొత్త ఔషధాల కోసం ప్రయోగాలు జరిపేలా అధునాత రీసర్చ్ అండ్ వెవలప్‌మెంట్ సదుపాయాల కల్పనపై దృష్టిపెట్టడం ఎంతో అవసరం ఉందన్నారు. దీనితోపాటుగా దేశాన్ని సంపూర్ణ ఆరోగ్యానికి కేంద్రంగా మార్చడంతోపాటు మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించేలా మరిన్ని చర్యలు చేపట్టాలని సూచించారు.