కన్నడ ప్రముఖ సినీ నటి కన్నుమూత..

కన్నడ సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారమే ప్రముఖ కన్నడ నటుడు గంగాధరయ్య అనారోగ్యంతో మరణించారు. ఒక్క రోజు గడవక ముందే మరో ప్రముఖ నటి మరణించారు. ఎన్నో సినిమాల్లో.. తల్లి, అమ్మమ్మ వంటి పాత్రల్లో అలరించిన..

కన్నడ ప్రముఖ సినీ నటి కన్నుమూత..

Updated on: Jul 20, 2020 | 12:41 PM

కన్నడ సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారమే ప్రముఖ కన్నడ నటుడు గంగాధరయ్య అనారోగ్యంతో మరణించారు. ఒక్క రోజు గడవక ముందే మరో ప్రముఖ నటి మరణించారు. ఎన్నో సినిమాల్లో.. తల్లి, అమ్మమ్మ వంటి పాత్రల్లో అలరించిన సీనియర్ నటి శాంతమ్మ (95) ఆదివారం రాత్రి కన్ను మూశారు. ఈమె కన్నడ చిత్ర సీమలో దాదాపు 200 పైగా చిత్రాల్లో వివిధ హీరోలకు తల్లి, నాన్నమ్మ పాత్రలతో నటించి మెప్పించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమె మైసూర్‌లో చికిత్స తీసుకుంటుంది. అయితే చికిత్సకు వయస్సు సహకరించకపోవడం కారణంగానే ఆమె మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. మైసూర్‌లో ఉండే శాంతమ్మ అనారోగ్యంతో గత కొంత కాలంగా చికిత్స తీసుకుంటున్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. కాగా శాంతమ్మ మృతికి ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు శాంతమ్మకు నివాళులు అర్పించారు.

Read More: 

బద్ధలైన అగ్ని పర్వతం.. మొదటిసారిగా కెమెరాకు చిక్కిన దృశ్యాలు

మరో మంత్రికి కరోనా పాజిటివ్..

Loading...
Unable to load recommendations.
Follow Us