బాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత ఇంతియాజ్ ఖాన్ కన్నుమూశారు. 77 ఏళ్ల ఇంతియాజ్ ఖాన్ మంగళవారం ముంబైలో మృతి చెందారు. అయితే ఆయన అనారోగ్యంతో ఈ రోజు ఉదయం మృతి చెందినట్లు బంధువులు చెబుతున్నారు. అలనాటి నటుడు జయంత్ కుమారుడు ఈయన. యాదోంకీ బారత్, ధర్మాత్మ, దయావన్ వంటి చిత్రాల్లో ఇంతియాజ్ నటించారు. కాగా ఆయన మృతి చెందినట్లు ట్రేడ్ అనలిస్ట్ అతుల్ మోహన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ట్వీట్‌లో ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ‘గబ్బర్ సింగ్’ అంటే పవన్ కళ్యాణ్ నటించిన సినిమానే గుర్తుకు వస్తుంది. కానీ ఈ గబ్బర్ సింగ్ అనే పేరు.. అప్పట్లో అమితాబ్, ధర్మేంద్ర హీరోలుగా నటించిన ‘షోలే’ సినిమాలో విలన్ పేరు. ఇక గబ్బర్ సింగ్‌గా ఫేమస్ అయిన బాలీవుడ్ నటుడు అమ్జద్ ఖాన్ సోదరుడు ఇంతియాజ్ ఖాన్ మంగళవారం అనారోగ్యంతో కన్ను మూశారు.
Read More this also: దొరబాబు విషయంలో.. హైపర్ ఆది కీలక నిర్ణయం! ఇకపై ఆ కామెంట్స్
ఇంటింటికి ఉచితంగా కిలో చికెన్ సప్లై.. గారెలతో కలిపి
దారుణంగా పడిపోయిన టమాటా ధరలు.. పదికి 3 కిలోలు