వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం విషయంలో ఇంకా తెగని వివాదం.. రేపటి వాదనలపై ఉత్కంఠ

|

Dec 15, 2020 | 7:32 AM

వేములవాడ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదం ఇంకా ఎటూ తేలడంలేదు. అతనికి భారత పౌరసత్వం లేదంటూ కోర్టులో దాఖలైన పిటిషన్...

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం విషయంలో ఇంకా తెగని వివాదం.. రేపటి వాదనలపై ఉత్కంఠ
Follow us on

వేములవాడ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదం ఇంకా ఎటూ తేలడంలేదు. అతనికి భారత పౌరసత్వం లేదంటూ కోర్టులో దాఖలైన పిటిషన్ మీద రేపు (డిసెంబర్16) మరొకసారి వాదనలు జరుగనున్నయి. జర్మనీ పౌరసత్వంతో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందిన చెన్నమనేని రమేష్ పై హైకోర్టులో సుదీర్ఘకాలంగా వాదనలు కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు మార్లు కేంద్ర ప్రభుత్వం సైతం చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వాన్ని రద్దు చేసింది. చెన్నమనేని రమేష్ పై కేసు హైకోర్టులో పెండింగ్లో ఉండగానే గత డిసెంబర్ మూడవ వారంలో జర్మన్ పాస్ పోర్ట్ తో చెన్నై నుండి జర్మనీ వెళ్లినట్టు హైకోర్టు దృష్టికి తెచ్చారు పిటిషనర్.

అయితే కేసు పెండింగ్లో ఉండగా చెన్నమనేని రమేష్ జర్మనీ వెళ్ళిన అంశం అఫిడవిట్లో పేర్కొనక పోవడం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సైతం పలుమార్లు చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాని పై కోర్టులో స్టే లు తెచ్చుకుంటున్నారు రమేష్. ఇక ఇప్పుడు కేసు కొలిక్కి వస్తుందని భావిస్తున్న నేపథ్యంలో రేపు తెలంగాణ హైకోర్టు చెన్నమనేని రమేష్ పౌరసత్వం పై ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఆసక్తిగా మారింది.