గుజరాత్‌కు తప్పిన ముప్పు… ఒమన్‌వైపు మళ్లిన వాయు తుఫాన్

| Edited By:

Jun 14, 2019 | 1:36 PM

గుజరాత్‌కు వాయుగండం తప్పింది. వాయు తుఫాన్ దిశను మార్చుకుని ఆ రాష్ట్ర తీరం నుంచి ఒమన్‌వైపు కదులుతున్నట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ తీర ప్రాంతాలకు పెనుగాలులు, భారీ వర్షాల నుంచి ముప్పు పొంచి ఉందని చెప్పారు. తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తీర ప్రాంతాల నుంచి 3 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మాట్లాడుతూ.. భారత వాతావరణ విభాగం(ఐఎండీ) బులెటిన్ ప్రకారం.. వాయు తుఫాన్ దిశను మార్చుకుని ఒమన్ […]

గుజరాత్‌కు తప్పిన ముప్పు... ఒమన్‌వైపు మళ్లిన వాయు తుఫాన్
Follow us on

గుజరాత్‌కు వాయుగండం తప్పింది. వాయు తుఫాన్ దిశను మార్చుకుని ఆ రాష్ట్ర తీరం నుంచి ఒమన్‌వైపు కదులుతున్నట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ తీర ప్రాంతాలకు పెనుగాలులు, భారీ వర్షాల నుంచి ముప్పు పొంచి ఉందని చెప్పారు. తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తీర ప్రాంతాల నుంచి 3 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మాట్లాడుతూ.. భారత వాతావరణ విభాగం(ఐఎండీ) బులెటిన్ ప్రకారం.. వాయు తుఫాన్ దిశను మార్చుకుని ఒమన్ దిశగా కదులుతున్నది. అయినప్పటికీ వచ్చే 24 గంటల పాటు హై అలర్ట్ కొనసాగుతుంది అని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా సౌరాష్ట్రలోని తీర ప్రాంత జిల్లాలతో పాటు కచ్‌లో శుక్రవారం కూడా సెలవు ప్రకటించారు.