కుక్కగారి లక్కే లక్కు ! టౌన్ మేయరై కూచుంది !

| Edited By: Anil kumar poka

Nov 05, 2020 | 1:35 PM

అమెరికా కొత్త అధ్యక్షుడెవరో ఇంకా తేలనేలేదు, కానీ..ఓ చిన్న టౌన్ మాత్రం తమ 'మేయర్' గా కుక్కను ఎన్నుకుంది. కెంటకీ లోని 'రాబిట్ హషిష్' అనే ఈ టౌన్ వాసులు ఈ పదవికి మనుషులే దొరకనట్టు...

కుక్కగారి లక్కే లక్కు ! టౌన్ మేయరై కూచుంది !
Follow us on

అమెరికా కొత్త అధ్యక్షుడెవరో ఇంకా తేలనేలేదు, కానీ..ఓ చిన్న టౌన్ మాత్రం తమ ‘మేయర్’ గా కుక్కను ఎన్నుకుంది. కెంటకీ లోని ‘రాబిట్ హషిష్’ అనే ఈ టౌన్ వాసులు ఈ పదవికి మనుషులే దొరకనట్టు విల్ బర్  బీస్ట్ అనే ఫ్రెంచ్ బుల్ డాగ్ ను మేయర్ గా ఎన్నుకున్నారు. ఈ శునకానికి 13,145 ఓట్లు వచ్చి విజేత అయిందని రాబిట్ హాష్ హిస్టారికల్ సొసైటీ తెలిపింది. మొత్తం 22,985 ఓట్లు పోలయ్యాయని, జాక్ రాబిట్ అనే కుక్కకి  రెండోస్థానం, గోల్డెన్ రిట్రీవర్ అయిన ‘పప్పీ’ కి మూడో స్థానం దక్కాయని ఈ సొసైటీ ఫేస్ బుక్ లో తెలిపింది.

ఇక 12 సంవత్సరాల ‘కోలీ’ టౌన్ అంబాసిడర్ గా తన ‘పదవిని’ నిలుపుకొందట ! ఒహియో నదీ తీరాన నివసించే రాబిట్ హాష్ తెగవారు 1990 ప్రాంతం నుంచే శునకాలను తమ మేయర్ గా ఎన్నుకుంటున్నారు. హిస్టారికల్ సొసైటీకి ఒక డాలర్ విరాళమిఛ్చి వీరు ఓట్లు వేయడం విశేషం, ఇక శునకంగారి డ్యూటీ ఏమిటంటే.. ఈ సొసైటీకి నిధులు సమీకరించడంలో తోడ్పడమేనట !