Covid-19 Mutation: మరింత బలంగా.. కరోనా వైరస్.. అమెరికా శాస్త్రవేత్తల హెచ్చరిక..

| Edited By:

May 06, 2020 | 1:25 PM

కోవిద్-19 రూపాంతరం చెందుతోంది. క్రమంగా బలం పుంజుకుంటోంది. ఇప్పటివరకూ మనం చూస్తున్న కరోనా వైరస్... బంతిలా ఉండి... దానిపై అక్కడక్కడా కొవ్వుతో తయారైన ముళ్లు ఉన్నాయి. కొత్తగా కనిపిస్తున్న కరోనా

Covid-19 Mutation: మరింత బలంగా.. కరోనా వైరస్.. అమెరికా శాస్త్రవేత్తల హెచ్చరిక..
Follow us on

Coronavirus Mutation: కోవిద్-19 రూపాంతరం చెందుతోంది. క్రమంగా బలం పుంజుకుంటోంది. ఇప్పటివరకూ మనం చూస్తున్న కరోనా వైరస్… బంతిలా ఉండి… దానిపై అక్కడక్కడా కొవ్వుతో తయారైన ముళ్లు ఉన్నాయి. కొత్తగా కనిపిస్తున్న కరోనా వైరస్‌కి ఆ ముళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలా రూపాంతరం (Mutation) చెందిన కొత్త వైరస్… ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందనీ, ఇది ఇప్పటివరకూ ఉన్న కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైనది, బలమైనది అని అమెరికాలోని లాస్ అలామోస్ నేషనల్ లాబొరేటరీ (LANL) శాస్త్రవేత్తల బృందం తెలిపింది.

వివరాల్లోకెళితే.. LANLను… రెండో ప్రపంచ యుద్ధకాలంలో… అణ్వాయుధాలను తయారుచేసేందుకు ఏర్పాటు చేసింది అమెరికా ప్రభుత్వం. ఈ ల్యాబొరేటరీలోని సైంటిస్టులు తాజాగా కరోనా వైరస్‌పై 33 పేజీల రిపోర్ట్ తయారుచేశారు. ప్రపంచవ్యాప్తంగా 6వేల కరోనా వైరస్‌లను పరిశీలించి… ఈ రిపోర్ట్ రూపొందించారు. ఫిబ్రవరిలో యూరప్‌లో అదనపు ముళ్లతో పుట్టిన కరోనా వైరస్… ఆ తర్వాత అమెరికా తూర్పు తీరానికి వెళ్లింది. అక్కడి నుంచి మార్చి మధ్య నాటికి… ప్రపంచమంతా పాకింది.