వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీకి చేదు అనుభవం

|

Jul 01, 2019 | 3:47 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నార్త్ కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ భేటీ సందర్భంగా వైట్ హౌస్ కొత్త ప్రెస్ సెక్రటరీ 42 ఏళ్ళ స్టెఫానీ గ్రిషం కి చేదు అనుభవం ఎదురైంది. నార్త్ కొరియా సెక్యూరిటీ దళాలకు ఆమె ఎవరో తెలియక తోసివేశారు. తననే అడ్డుకుంటున్న వారి నుంచి తప్పించుకునేందుకు ఆమె దాదాపు ఘర్షణకు దిగినంత పరిస్థితి ఏర్పడింది. ట్రంప్, కిమ్ సమావేశమైన ప్రాంతంలో అమెరికన్ రిపోర్టర్లను ఆపివేసిన ఉత్తర కొరియా దళాలు ఆమెను […]

వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీకి చేదు అనుభవం
Follow us on

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నార్త్ కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ భేటీ సందర్భంగా వైట్ హౌస్ కొత్త ప్రెస్ సెక్రటరీ 42 ఏళ్ళ స్టెఫానీ గ్రిషం కి చేదు అనుభవం ఎదురైంది. నార్త్ కొరియా సెక్యూరిటీ దళాలకు ఆమె ఎవరో తెలియక తోసివేశారు. తననే అడ్డుకుంటున్న వారి నుంచి తప్పించుకునేందుకు ఆమె దాదాపు ఘర్షణకు దిగినంత పరిస్థితి ఏర్పడింది. ట్రంప్, కిమ్ సమావేశమైన ప్రాంతంలో అమెరికన్ రిపోర్టర్లను ఆపివేసిన ఉత్తర కొరియా దళాలు ఆమెను కూడా కదలనివ్వలేదు. అయితే అమెరికా మీడియా ముందుకు వెళ్లేందుకు స్టెఫానీ అతికష్టం మీద దూసుకు వచ్చి .. వెళ్ళండి..వెళ్ళండి.. ‘ (గో… గో..) అంటూ కేకలు పెట్టడం వీడియోలో రికార్డయ్యింది . ఈమె ఇటీవలే వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ బాధ్యతలు చేబట్టింది. కాగా- సౌత్ కొరియా భవనమైన హౌస్ ఆఫ్ ఫ్రీడమ్ బయట స్టెఫానీ.. తమ దేశ జర్నలిస్టులకు ఆదేశాలిస్తూ కనబడింది.ఆదివారం ట్రంప్, కిమ్ మధ్య సుమారు గంటసేపు చర్చలు జరిగాయి. ట్రంప్ కి గట్టి మద్దతుదారైన స్టెఫానీకే ఇలాంటి చేదు అనుభవం కలగడం పట్ల అమెరికన్ జర్నలిస్టులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.