
మనం గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నవారిని చూశాం.. ఎర్ర చందనం చేస్తున్నవారి గురించి చదవాం.. ఇలా చివరికి మనుషుల వెంట్రుకలను ఓ దేశం నుంచి ఇతర దేశాలకు తరలించేవారిని కూడా మనం చూశాం. అయితే ఓ వ్యక్తి కెనడా నుంచి మూడు బర్మీస్ కొండచిలువలను స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోాయాడు. ఇందులో ఏం ప్రత్యేకత ఉందని ఆశ్చర్యపోతున్నారా.. అయితే ఇతను వాటిని తరలించిన పద్దతి అధికారులను షాకింగ్‌కు గురి చేసింది. అమెరికాకు చెందిన ఈ స్మగ్లర్ సరీసృపాలను యుఎస్-కెనడియన్ సరిహద్దు గుండా అక్రమంగా తరలించే ప్రయత్నంలో దొరికిపోయాడు. ఆ వ్యక్తి తన ప్యాంటులో వాటిని దాచుకున్నట్లుగా అధికారులు గుర్తించారు.
బర్మీస్ పైథాన్‌ల దిగుమతి అంతర్జాతీయ ఒప్పందం, సమాఖ్య చట్టం ద్వారా నేరం. న్యూయార్క్‌కు చెందిన ఇతను బర్మీస్ పైథాన్‌లు మానవులకు హానికరమైనవిగా జాబితా చేయబడ్డాయి ఈ.ఫెడరల్ స్మగ్లింగ్ చట్టాలను ఉల్లంగించిన ఆరోపణలపై అరెస్ట్ చేశారు.
బర్మీస్ పైథాన్ ప్రపంచంలోని అతిపెద్ద పాములలో ఒకటి, దాని స్థానిక ఆసియాలో హాని కలిగించే జాతిగా పరిగణించబడుతుంది. అయినప్పటికీ, ఈ జాతి యునైటెడ్ స్టేట్స్ ఫ్లోరిడాలో స్మగ్లింగ్ చేస్తుంటారు. అయితే ఇలా దొరికినవారికి చట్టం కఠినంగా శిక్షిస్తుంటుంది.
కెనడా నుండి మూడు బర్మీస్ కొండచిలువలను అక్రమంగా రవాణా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాల్విన్ బటిస్టా, నేరం రుజువైతే గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్షతోపాటు $250,000 జరిమానా విధించబడుతుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం