24 చైనా కంపెనీలను బ్లాక్ లిస్టులో ఉంచిన అమెరికా

అమెరికా, చైనా మధ్య సంబంధాలు క్రమేపీ పూర్తిగా దిగజారుతున్నాయి. 24 చైనా కంపెనీలను అమెరికా బ్లాక్ లిస్టులో ఉంచింది. సౌత్ చైనా సీ లో ఇవి కృత్రిమ ద్వీపాలను నిర్మిస్తున్నాయని..

24 చైనా కంపెనీలను బ్లాక్ లిస్టులో ఉంచిన అమెరికా

Edited By:

Updated on: Aug 26, 2020 | 8:17 PM

అమెరికా, చైనా మధ్య సంబంధాలు క్రమేపీ పూర్తిగా దిగజారుతున్నాయి. 24 చైనా కంపెనీలను అమెరికా బ్లాక్ లిస్టులో ఉంచింది. సౌత్ చైనా సీ లో ఇవి కృత్రిమ ద్వీపాలను నిర్మిస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. చైనా కమ్యూనికేషన్స్ కంస్ట్రక్షన్ కంపెనీ, చైనా షిప్ బిల్డింగ్ గ్రూప్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. సౌత్ చైనా సముద్రంపై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడానికి ఈ రెండు దేశాలూ ప్రయత్నిస్తున్నాయి. కాగా అమెరికా చర్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.