ఉప్పల్ భూముల ధరలకు రెక్కలు.. గజం రూ. 80 వేలు!

| Edited By:

Dec 16, 2019 | 5:36 PM

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ శనివారం నిర్వహించిన వేలంలో నాగోల్‌లోని ఉప్పల్ భగత్ లేఅవుట్ వద్ద భూమి చదరపు గజానికి రూ .77,000 పలికింది. ఈ విలువ ఆదివారం 79,900లకు పెరిగింది. బూమ్ లేకున్నా ఈ భూములు రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. దీంతో రియాల్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. వేలం ప్రక్రియ ద్వారా హెచ్‌ఎండీఏకు మొదటి రోజు రూ.155 కోట్ల ఆదాయం, రెండో రోజు రూ.135 కోట్ల ఆదాయం సమకూరింది. సగటున గజం రూ. 46 వేల […]

ఉప్పల్ భూముల ధరలకు రెక్కలు.. గజం రూ. 80 వేలు!
Follow us on

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ శనివారం నిర్వహించిన వేలంలో నాగోల్‌లోని ఉప్పల్ భగత్ లేఅవుట్ వద్ద భూమి చదరపు గజానికి రూ .77,000 పలికింది. ఈ విలువ ఆదివారం 79,900లకు పెరిగింది. బూమ్ లేకున్నా ఈ భూములు రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. దీంతో రియాల్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. వేలం ప్రక్రియ ద్వారా హెచ్‌ఎండీఏకు మొదటి రోజు రూ.155 కోట్ల ఆదాయం, రెండో రోజు రూ.135 కోట్ల ఆదాయం సమకూరింది. సగటున గజం రూ. 46 వేల ధర పలికింది. కాగా.. గత ఏప్రిల్ లో జరిగిన వేలంలో గజానికి రూ .73,900 చొప్పున ధర పలికింది.