ఆర్టీసీ కార్మికుల చర్చలు విఫలం.. సమ్మె తప్పదా..?

| Edited By:

Oct 02, 2019 | 3:34 PM

ఆర్టీసీ కార్మికుల సమ్మె యోజనపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. కార్మికులు సమ్మె ఆలోచనను విరమించుకునేలా ప్రభుత్వం ముందుగానే చర్యలు చేపట్టింది. కార్మిక సంఘాల నాయకులతో సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిపింది. కాగా, ఈ సమావేశంలో మొత్తం 26 డిమాండ్లను ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వం ముందుంచింది. అయితే, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను సానుకూలంగా విన్నామని ఆర్జీటీ ఇన్‌ఛార్జ్ సునీల్ శర్మ అన్నారు. కేసీఆర్ ఆర్టీసీ పై ప్రత్యేక దృష్టి పెట్టారని, రాజ్యాంగ బద్ధంగా ఐఏఎస్‌ల […]

ఆర్టీసీ కార్మికుల చర్చలు విఫలం.. సమ్మె తప్పదా..?
Follow us on

ఆర్టీసీ కార్మికుల సమ్మె యోజనపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. కార్మికులు సమ్మె ఆలోచనను విరమించుకునేలా ప్రభుత్వం ముందుగానే చర్యలు చేపట్టింది. కార్మిక సంఘాల నాయకులతో సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిపింది. కాగా, ఈ సమావేశంలో మొత్తం 26 డిమాండ్లను ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వం ముందుంచింది. అయితే, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను సానుకూలంగా విన్నామని ఆర్జీటీ ఇన్‌ఛార్జ్ సునీల్ శర్మ అన్నారు. కేసీఆర్ ఆర్టీసీ పై ప్రత్యేక దృష్టి పెట్టారని, రాజ్యాంగ బద్ధంగా ఐఏఎస్‌ల కమిటీ ఏర్పడిందన్నారు సోమేష్ కుమార్. దసరా సమయంలో సమ్మె వద్దని ఆయన విజ్ఞప్తి చేశామన్నారు. అన్ని సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని.. కాస్త ఓపిక పట్టాలని చెప్పారు.

ఆర్టీసీ ఇప్పటికే ఆర్థికంగా నష్టాల్లో ఉన్న కారణంగా సమ్మె నిర్ణయాన్ని విరమించుకుని సహకరించాలని ఉద్యోగులను క్యాబినెట్ కోరింది. సొంత సంస్థకే నష్టం కలిగించరాదని కార్మికులకు సూచించారు. దసరా పండుగ సందర్భంగా ప్రజలంతా స్వస్థలానికి ప్రయాణమయ్యే వేళ సమ్మెకు దిగి, వారిని ఇబ్బందుల పాలు చేయవద్దని ప్రభుత్వం కోరింది. ఇక ఎట్టిపరిస్థితుల్లోనూ కార్మికుల డిమాండ్లకు పరిష్కారం చూపడంతోపాటు కమిటీ నివేదిక అందగానే.. సంస్థ పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు.

ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధ్యక్షతన ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, సునీల్‌శర్మ సభ్యులుగా కమిటీని నియంచారు. ఈ కమిటీతో కార్మికులు తమ సమస్యలపై చర్చించారు. డిమాండ్లను సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని, ప్రభుత్వం కూడా సంస్థను కాపాడాలనే కృతనిశ్చయంతో ఉందని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు ఆర్టీసీ కార్మికులు మాత్రం సమ్మెను చేపడతామని చెబుతున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చేవరకూ సమ్మె కొనసాగిస్తామంటున్నారు.