వారెంట్ లేకుండానే సెర్చ్, యూపీలో ఇక స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ !

| Edited By: Pardhasaradhi Peri

Sep 14, 2020 | 12:18 PM

ఎలాంటి  వారెంట్ లేకుండానే సెర్చ్ చేయడానికి అధికారాలు కలిగిన స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలని యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్టంలోని సివిల్ కోర్టుల్లో..

వారెంట్ లేకుండానే సెర్చ్, యూపీలో ఇక  స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ !
Follow us on

ఎలాంటి  వారెంట్ లేకుండానే సెర్చ్ చేయడానికి అధికారాలు కలిగిన స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలని యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్టంలోని సివిల్ కోర్టుల్లో ఎలాంటి భద్రత లేకపోవడంపై అలహాబాద్ హైకోర్టు గత ఏడాది డిసెంబరులో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఫోర్స్ సభ్యులు మేజిస్ట్రేట్ ఉత్తర్వులు గానీ, వారెంట్ గానీ లేకుండానే ఎవరినైనా అరెస్టు చేయవచ్ఛు. మొదటి దశలో అయిదు బెటాలియన్లను నియమిస్తారని, ఆ తరువాత ఈ సంఖ్య పెరగవచ్చునని రాష్ట్ర హోమ్ శాఖ వర్గాలు తెలిపాయి. మొదటి దశకు రూ. 1747 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో నేరాల సంఖ్యను తగ్గించడానికి కూడా ఈ చర్య దోహదపడుతుందని భావిస్తున్నారు.