ఉదయ్ కిరణ్ బయోపిక్: సందీప్ కాదు…ఎవరంటే..?

|

Nov 26, 2019 | 10:10 AM

ఉదయ్ కిరణ్..తెలుగు చలన చిత్ర సీమలో పరిచయం అక్కర్లేని పేరు. ‘చిత్రం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ లవర్ బాయ్..బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో మంచి ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వెండితెర ఎంట్రీ ఇచ్చి హీరోగా రాణించిన ఉదయ్ జీవితం ఎంతోమందికి ఆదర్శం. కానీ ఈ లవర్ బాయ్ కెరీర్‌లో హైట్స్‌కి ఎంత త్వరగా రీచ్ అయ్యాడో..అంతే త్వరగా డౌన్ కూడా అయ్యాడు. ఆ తర్వాత పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా  ఎన్నో […]

ఉదయ్ కిరణ్ బయోపిక్: సందీప్ కాదు...ఎవరంటే..?
Follow us on

ఉదయ్ కిరణ్..తెలుగు చలన చిత్ర సీమలో పరిచయం అక్కర్లేని పేరు. ‘చిత్రం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ లవర్ బాయ్..బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో మంచి ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వెండితెర ఎంట్రీ ఇచ్చి హీరోగా రాణించిన ఉదయ్ జీవితం ఎంతోమందికి ఆదర్శం. కానీ ఈ లవర్ బాయ్ కెరీర్‌లో హైట్స్‌కి ఎంత త్వరగా రీచ్ అయ్యాడో..అంతే త్వరగా డౌన్ కూడా అయ్యాడు. ఆ తర్వాత పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా  ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. అవి అతన్ని ఆత్మహత్య దిశగా ప్రేరేపించాయి. ఇప్పటికి ఉదయ్ చనిపోయి ఐదేళ్లు దాటిపోయినా అతను అభిమానులకు ఎవర్‌గ్రీన్ హీరో. అయితే ఇటీవల చాలా రోజులుగా ఉదయ్ కిరణ్ బయోపిక్ గురించి వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఉదయ్‌ని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు తేజానే ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడని రూమర్స్ వచ్చాయి. కానీ తేజ వాటిని కొట్టిపారేశాడు. తనకు ఆ ఆలోచన లేదని లేల్చి చెప్పాడు.

కానీ ఇప్పుడు మరోసారి ఉదయ్ బయోపిక్ వార్తలు తెరపైకి వచ్చాయి. యంగ్ హీరో సందీప్ కిషన్ ..ఉదయ్ కిరణ్ పాత్రలో నటించబోతున్నాడంటూ ఒక్కసారిగా వార్తలు వ్యాపించాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేనట్టు పక్కా సమాచారం. ఓ షార్ట్ ఫిల్మ్ మేకర్ సందీప్‌ను అప్రోచ్ అయిన మాట వాస్తవమే కానీ..అతడు ఆ పాత్రలో నటించేందుకు సంసిద్దంగా లేడట. ఇదే సమయంలో న్యాచురల్ నాని తెరపైకి వచ్చాడు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి..ఉదయ్‌లాగే హీరోగా ఎదిగిన నాని అయితే ఆ పాత్రకు న్యాయం చేయగలడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి నాని, ఉదయ్ కిరణ్ ఇద్దరిలో కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. అయితే ఉదయ్ లైఫ్‌లో ఓ పెద్ద సినిమా కుటుంబంతో  కొన్ని వివాదస్పద ఎపిసోడ్స్ ఉన్న నేపథ్యంలో..నాని ఈ మూవీ ప్రపోజల్‌పై ఎలా రెస్పాండ్ అవుతాడన్నది వేచి చూడాలి.