UBS Group Talks To Invest In Paytm: భారత దేశంలో మొట్టమొదటిసారి డిజిటల్ లావాదేవీలను పరిచయం చేసింది పేటీఎమ్. భారత్‌కు చెందిన పేటీఎమ్‌కు కోట్ల సంఖ్యలో వినియోగదారులు ఉన్నారు. ఇక పెద్ద నోట్ల రద్దు తర్వాత, ఎకానమీ డిజిటల్ బాట పట్టడంతో పేటీఎమ్ ఒక్కసారిగా దూసుకెళ్లింది. దీంతో పేటీఎమ్ లాభాల బాట పట్టింది.
ఈ క్రమంలో చాలా బడా కంపెనీలు పేటీఎమ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. మరీ ముఖ్యంగా విదేశీ కంపెనీలు పేటీఎమ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందు వరుసలో నిలిచాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో విదేశీ సంస్థ పేటీఎమ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిచూపిస్తున్నట్లు తెలుస్తోంది. స్విట్టర్లాండ్‌కు చెందిన ‘యూబీఎస్’ భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతుందని సమాచారం. ఇందుకోసం ఇప్పటికే పేటీఎమ్‌తో చర్చలు జరిపారని త్వరలోనే ఈ డీల్ కార్యరూపం దాల్చనుందని టాక్. ఇక యూబీఎస్ ఏకంగా 400 మిలియన్ డాలర్లు మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 29వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తికనబరుస్తుందని అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ బ్లామ్‌బెర్గ్ తెలిపింది.
Also Read: Republic Day Sales: గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లను ప్రకటించిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్