అమెరికాలో కొనసాగుతున్న మరణమృదంగం

|

Jul 24, 2020 | 8:20 PM

కరోనా మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. నిత్యం పెరుగుతున్న కేసులకు తోడు మరణాల సంఖ్య అదే స్థాయిలో ఉంటోంది. కొద్దిరోజులు తగ్గుమొఖం పట్టిన డెత్‌ రేటు మళ్లీ గణనీయంగా నమోదవుతోంది. చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కొన్ని ప్రాంతాల్లో రోజుల తరబడి వేచిచూసే పరిస్థితి నెలకొంది.

అమెరికాలో కొనసాగుతున్న మరణమృదంగం
Follow us on

కరోనా మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. నిత్యం పెరుగుతున్న కేసులకు తోడు మరణాల సంఖ్య అదే స్థాయిలో ఉంటోంది. కొద్దిరోజులు తగ్గుమొఖం పట్టిన డెత్‌ రేటు మళ్లీ గణనీయంగా నమోదవుతోంది. చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కొన్ని ప్రాంతాల్లో రోజుల తరబడి వేచిచూసే పరిస్థితి నెలకొంది. శ్మశాన వాటికలో క్రిమేషన్‌‌‌‌ చేసేందుకు రెండు వారాల దాకా వెయిట్‌ చేయాల్సి వస్తోంది .

కరోనా వ్యాధిగ్రస్తులతో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతుంది. అంతే సంఖ్యలో మరణాల సంఖ్య పెరుగుతోంది. గత రెండ్రోజులుగా వెయ్యికి పైనే మరణాలు నమోదయ్యాయి. జులై 21న 1,165.. జులై 22న 1,205 మంది కరోనా బారిన పడి ప్రాణాలొదిలారు. ముఖ్యంగా నెవెడా, టెక్సస్‌‌‌‌, అల్బా మాలో ఎక్కువ మంది వైరస్ ను జయించలేక మరణించారు. టెక్సస్‌‌‌‌లో పరిస్థితి దారుణంగా తయారైంది. వెయ్యికి పైగా మృతదేహాలు అంతక్రియల కోసం ఎదురుచూస్తున్నాయి. ఒక్కో ట్రక్కులో 50 మృతదేహాలను రెండు వారాల వరకూ ఉంచుతున్నారు. అమెరికాలో గతంలోనే భారగా మరణాలు సంభవించినప్పటికీ ఇంతటి స్థాయిలో దహన సంస్కారాల కోసం వేచిచూడలేదు. కానీ ప్రస్తుతం రోజుల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. తమ వంతు వచ్చేదాకా డెడ్ బాడీలను ఫ్రిజ్ ల్లో భద్రపరుస్తున్నారు.

అమెరికా లో ఏప్రిల్‌‌‌‌లో వైరస్‌‌‌‌ విజృంభించినా జూన్‌‌‌‌ తొలి రెండు వారాల్లో కాస్తగా తక్కువగా ప్రభావం చూపింది. కానీ జులైలో వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. రెండు వారాలుగా రోజూ 60 వేలకు పైనే కేసులు నమోదవుతున్నాయి. జులై 17న అత్యధికంగా 74,987 కేసులు రికార్డయ్యాయి. ప్రస్తుతం అక్కడ కేసులు 41 లక్షలు దాటాయి. మరణాలు లక్షా 46 వేలకు చేరుకున్నాయి. రికవరీలు ఇరవై లక్షలకు దగ్గర్లో ఉన్నాయి.

కేసులు పెరుగుతుండటంతో ప్రజలను ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌‌‌‌ హెచ్చరిస్తున్నారు. కరోనా కట్టడి అనేక చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు కూడా అప్రమత్తంగా చూడాలని సూచిస్తున్నారు. వైరస్‌‌‌‌ తీవ్రత తగ్గిపోయే ముందు మరిం త ఎక్కువ కావచ్చన్నారు ట్రంప్. త్వరలో వ్యాక్సిన్‌‌‌‌ అందుబాటులోకి రానుందని ప్రజలు భయపడాల్సిన పనిలేదన్నారు.