చంద్రుడిపై కారు రేసులు.. జాబిల్లి పైకి కార్లు పంపనున్న అమెరికా

చంద్రుడి పైన కార్లు రయ్మంటూ తిరగబోతున్నాయి.. త్వరలో అక్కడ కూడాకార్ రేస్ లు జరగనున్నాయి. ఇది జోక్ కాదండి నిజమే త్వరలో చంద్రుడిపై కార్లను పంపనున్నారు. ఇందుకోసం అమెరికా హైస్కూల్‌ విద్యార్థులు రెండు కార్లను డిజైన్‌ చేయనున్నారు.

చంద్రుడిపై కారు రేసులు.. జాబిల్లి పైకి కార్లు పంపనున్న అమెరికా
Follow us

|

Updated on: Dec 02, 2020 | 10:03 AM

చంద్రుడి పైన కార్లు రయ్ రయ్ మంటూ.. తిరగబోతున్నాయి.. త్వరలో అక్కడ కూడా కార్ రేస్ లు జరగనున్నాయి. ఇది జోక్ కాదండి నిజమే త్వరలో చంద్రుడిపై కార్లను పంపనున్నారు. ఇందుకోసం అమెరికా హైస్కూల్‌ విద్యార్థులు రెండు కార్లను డిజైన్‌ చేయనున్నారు. ఈ కార్లను రిమోట్ కంట్రోల్ ద్వారా నడపనున్నారు. భూమిమీద నుండే రిమోట్ ద్వారా అక్కడ కార్లను నడపనున్నారు. 2021 అక్టోబర్‌లో జాబిల్లిపైనా కార్ రేస్ కూడా నిర్వహించనున్నారట.

మూన్‌ మార్క్‌ మిషన్‌–1 పేరుతో అమెరికాలో 6 వేర్వేరు హైస్కూల్‌ విద్యార్థులతో కార్లను డిజైన్‌ చేయించనున్నారు. రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా సంకేతాలు పంపొచ్చని, ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ ల్యాండర్‌ను వైఫైతో కనెక్ట్‌ చేయడం ద్వారా రేసు నడుస్తుందని కంపెనీ సీటీవో తెలిపారు . ఇక చంద్రుడి పైకి పంపే కార్లు సైజు చాలా చిన్నగా ఉండనుంది. ఒకొక్క కారు బరువు 2.5 కిలోలు ఉండనుంది. ఇలా రెండు కారులను పంపనున్నారు. అలాగే చంద్రుడి పైన కార్లను దింపే వస్తువు బరువు 3 కిలోలు ఉండనుంది. ఇలా రెండు కార్లు వాటిని దించేందుకు ఉపయోగించే ఒక వస్తువు మొత్తం 8 కిలోల బరువును చంద్రుడి పైకి పంపనున్నారు. అయితే ఈ ఎనిమిది కిలోల బరువు ఖర్చు మాత్రం భారీగానే ఉంది.  వీటిని అక్కడికి తీసుకెళ్లేందుకు కనీసం రూ.73 కోట్లు ఖర్చు కానుందట. ముందుగా స్పేస్‌ ఎక్స్‌ కంపెనీకి చెందిన ఫాల్కన్‌–9 రాకెట్‌ ద్వారా ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ అనే కంపెనీ తయారు చేసిన ‘నోవా–సీ’ ల్యాండర్  ద్వారా జాబిల్లిపైకి చేరనుంది. ఆ తర్వాత ‘నోవా–సీ’ ద్వారా ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆతర్వాత కార్లను పంపనున్నారు. ఇక ఈ కార్ రేస్ ను లైవ్ లో ప్రసారం చేయాలని ఈ పోటీని నిర్వహిస్తున్న మూన్‌మార్క్‌ కంపెనీ భావిస్తోంది. మరి ఇది సాధ్యమా..  అసాధ్యమా అన్నది తెలియాలంటే 2021 అక్టోబర్ వరకు ఎదురు చూడాల్సిందే.

Latest Articles
పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని గంగా నదిలో వేలాడదీసిన గ్రామస్తులు
పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని గంగా నదిలో వేలాడదీసిన గ్రామస్తులు
మీరు ఆధార్‌ కార్డుతో మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి?
మీరు ఆధార్‌ కార్డుతో మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి?
భారత పర్యటనకు దక్షిణాఫ్రికా.. షెడ్యూల్ ఖరారు..డేట్స్, వేదికలు ఇవే
భారత పర్యటనకు దక్షిణాఫ్రికా.. షెడ్యూల్ ఖరారు..డేట్స్, వేదికలు ఇవే
రాముడి ఆశీర్వాదం కోసం అయోధ్యకు మోదీ.. షెడ్యూల్ ఇదే!
రాముడి ఆశీర్వాదం కోసం అయోధ్యకు మోదీ.. షెడ్యూల్ ఇదే!
టాప్ 4కి దడ పుట్టిస్తోన్న బెంగళూరు.. రసవత్తరంగా ప్లేఆఫ్ రేసు..
టాప్ 4కి దడ పుట్టిస్తోన్న బెంగళూరు.. రసవత్తరంగా ప్లేఆఫ్ రేసు..
ఎండలు బాబోయ్ ఎండలు.. కారును రక్షించుకోవడమే పెద్ద టాస్క్
ఎండలు బాబోయ్ ఎండలు.. కారును రక్షించుకోవడమే పెద్ద టాస్క్
ప్రభాస్ ఎవరు..? అని అడిగారు.. డార్లింగ్ పై రానా కామెంట్స్..
ప్రభాస్ ఎవరు..? అని అడిగారు.. డార్లింగ్ పై రానా కామెంట్స్..
ఏనుగు మంచి మనసు.. ఎండలో అలసిపోయిన యజమాని కోసం ఏం చేసిందంటే..
ఏనుగు మంచి మనసు.. ఎండలో అలసిపోయిన యజమాని కోసం ఏం చేసిందంటే..
ఆ నిర్మాత చాలా వేధించాడు.. బుల్లితెర నటి
ఆ నిర్మాత చాలా వేధించాడు.. బుల్లితెర నటి
సిబిల్‌ లేదని బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదా? ఇలా చేస్తే లోన్‌..
సిబిల్‌ లేదని బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదా? ఇలా చేస్తే లోన్‌..