కొండచిలువల సయ్యటకు కుప్పకూలిన కిచెన్ పైకప్పు

జంగల్ లో ఉండాల్సిన జంతువులు జనంలోకి వస్తేనే వళ్లు జల్లుమంటుంది. అలాంటిది ఏకంగా వంటింట్లోకే వచ్చేశాయి రెండు భారీ సైజు కొండచిలువలు. అంతేకాదు ఆ ఇంటి పైకప్పును నేలకూర్చాయి. 45 కిలోల బ‌రువున్న రెండు భారీ కొండ‌చిలువ‌ల‌కు వంట‌గ‌దే దొరికింది. పాపం ఆ ఇంటి య‌జ‌మానికి భారీ న‌ష్టాన్ని మిగిల్చి వెళ్లాయి.

కొండచిలువల సయ్యటకు కుప్పకూలిన కిచెన్ పైకప్పు
Balaraju Goud

|

Sep 02, 2020 | 5:57 PM

జంగల్ లో ఉండాల్సిన జంతువులు జనంలోకి వస్తేనే వళ్లు జల్లుమంటుంది. అలాంటిది ఏకంగా వంటింట్లోకే వచ్చేశాయి రెండు భారీ సైజు కొండచిలువలు. అంతేకాదు ఆ ఇంటి పైకప్పును నేలకూర్చాయి. 45 కిలోల బ‌రువున్న రెండు భారీ కొండ‌చిలువ‌ల‌కు వంట‌గ‌దే దొరికింది. పాపం ఆ ఇంటి య‌జ‌మానికి భారీ న‌ష్టాన్ని మిగిల్చి వెళ్లాయి. కొండచిలువ రాకకు యాజమానికి నష్టమేంటనకుంటున్నారా? వాటి బ‌రువుకు కిచెన్ పైక‌ప్పు కాస్త కుప్పకూలింది. దీంతో ఆ ఇంటి య‌జ‌మాని లబోదిబోమ్ంటున్నారు. ఈ సంఘ‌ట‌న క్వీన్స్‌లాండ్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అక్క‌డ నివ‌సించే డేవిడ్ టైట్ ఇంటి పైక‌ప్పు ఊడి కింద ప‌డ‌డంతో వెంట‌నే స్నేక్ క్యాచ‌ర్ స్టీవెన్‌కు పిర్యాదు చేశారు. వాళ్లు వ‌చ్చి ఆ రెండు కొండ‌చిలువ‌ల‌ను ప‌ట్టుకొని బంధించారు.

క్వీన్స్‌లాండ్‌లో నివ‌సముంటున్న డేవిడ్ టైట్ ఇంటి అవరణలో రెండు ఫైథాన్లు వచ్చాయి. అవి రెండు ఇంటిపైకప్పులో చేరి పోట్లాడంతో కిచెన్ పైకప్పు కుప్పకూలింది. ఒక పైథాన్ 2.9 మీ పొడ‌వుంటే రెండోది 2.5 మీట‌ర్ల పొడ‌వుంద‌ని చెప్పుకొచ్చారు. వీటికి సంబంధించిన ఫోటోల‌ను బ్రౌన్ ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశారు. ఒక‌పాము త‌లుపు ప‌క్క‌న ఉంటే రెండో పాము బెడ్‌రూంలో ఉంది. ఇది సంతానోత్ప‌త్తి కాలం కావ‌డంతో మ‌గ పైథాన్‌లు ఆడ పైథాన్‌ల‌పై పోరాడుతున్నాయ‌ని బ్రౌన్ అంటున్నారు. ఈ రెండు పైథాన్‌ల‌ను ప‌ట్టుకొని 1 కి.మీ. దూరంలో ఉన్న అడ‌విలో వ‌దిలిపెట్టారు. ప్రపంచంలోని అత్యంత భయంకరమైన జంతువులకు ఆస్ట్రేలియా నిలయం అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు.

https://www.facebook.com/brisbanenorthsnakecatchersandrelocation/posts/1254110168263524

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu