రైతు చట్టాలకు మద్దతుగా యూపీ నుంచి ఢిల్లీకి 20 వేలమందికి పైగా అన్నదాతల ర్యాలీ, హర్యానా, ఉత్తరాఖండ్ నుంచి కూడా !

| Edited By: Anil kumar poka

Dec 24, 2020 | 6:49 AM

రైతు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దాదాపు నెల రోజులుగా అన్నదాతలు ఆందోళనలు, నిరసనలు చేస్తుండగా.. తాజాగా ఈ చట్టాలకు మద్దతుగా వీరిలోనే మరోవర్గం ర్యాలీలకు పూనుకొంది.

రైతు చట్టాలకు మద్దతుగా యూపీ నుంచి ఢిల్లీకి  20 వేలమందికి పైగా అన్నదాతల ర్యాలీ, హర్యానా, ఉత్తరాఖండ్ నుంచి కూడా !
Follow us on

రైతు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దాదాపు నెల రోజులుగా అన్నదాతలు ఆందోళనలు, నిరసనలు చేస్తుండగా.. తాజాగా ఈ చట్టాలకు మద్దతుగా వీరిలోనే మరోవర్గం ర్యాలీలకు పూనుకొంది. యూపీ, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీకి బయలుదేరారు. పశ్చిమ యూపీ నుంచి హింద్ మజ్దూర్ సమితికి చెందిన రైతులతో బాటు హర్యానా నుంచి రెండు గ్రూపులు, ఉత్తరాఖండ్ నుంచి ఓ గ్రూపు అన్నదాతలు హస్తిన బాట పట్టారు. సుమారు 20 వేలమందికి పైగా రైతులు నిన్న సాయంత్రం ర్యాలీకి తెర తీశారు. యూపీలో మధుర, ఆగ్రా, ఫిరోజాబాద్, ముజఫర్ నగర్, మీరట్, హత్రాస్ తదితర జిల్లాలకు చెందిన రైతులు వీరిలో ఉన్నారు. కిసాన్ సేన కన్వీనర్ ఠాకూర్ గౌరీ శంకర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తమ ర్యాలీకి అధికారుల నుంచి అనుమతి కోరామని, కానీ స్పందన లేదని చెప్పారు. ఏమైనా తామంతా ఢిల్లీకి వెళ్తున్నామని అన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల్లో తమ రాష్ట్రానికి చెందినవారు లేరని ఆయన తెలిపారు. తాము వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ను కలిసి రైతు చట్టాలకు తమ మద్దతు తెలియజేస్తామన్నారు.

కొన్ని రోజులుగా హర్యానా, ఉత్తరాఖండ్ రైతులు తోమర్ తో సమావేశమై, ఉచిత విద్య, సాగునీటి సౌకర్యాలు, వైద్య సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. హింద్ మజ్దూర్ సమితి వీరికి నాయకత్వం వహిస్తోంది.