టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు 14రోజుల రిమాండ్‌

| Edited By:

Oct 05, 2019 | 9:54 PM

టీవీ9లో నిధుల దుర్వినియోగంలో మాజీ సీఈవో రవిప్రకాష్‌పై ఉచ్చుబిగుస్తోంది. యాజమాన్యం ఫిర్యాదుతో బంజరాహిల్స్ పోలీసులు రవిప్రకాష్‌ను అరస్ట్ చేశారు. దాదాపు ఆరు గంటల పాటు విచారించిన పోలీసులు ఆయన్ను రిమాండ్‌కు తరలించారు. ఉదయం రవి ప్రకాష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. తొలుత గాంధీ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత సీతాఫల్ మండిలోని జడ్జి నివాసంలో హాజరపరచగా.. న్యాయమూర్తి రవి ప్రకాష్‌కు ఈనెల 18 వరకు రిమాండ్ విధించారు. రవి ప్రకాష్ నిబంధనలకు విరుద్ధంగా […]

టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు 14రోజుల రిమాండ్‌
Follow us on

టీవీ9లో నిధుల దుర్వినియోగంలో మాజీ సీఈవో రవిప్రకాష్‌పై ఉచ్చుబిగుస్తోంది. యాజమాన్యం ఫిర్యాదుతో బంజరాహిల్స్ పోలీసులు రవిప్రకాష్‌ను అరస్ట్ చేశారు. దాదాపు ఆరు గంటల పాటు విచారించిన పోలీసులు ఆయన్ను రిమాండ్‌కు తరలించారు. ఉదయం రవి ప్రకాష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. తొలుత గాంధీ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత సీతాఫల్ మండిలోని జడ్జి నివాసంలో హాజరపరచగా.. న్యాయమూర్తి రవి ప్రకాష్‌కు ఈనెల 18 వరకు రిమాండ్ విధించారు.

రవి ప్రకాష్ నిబంధనలకు విరుద్ధంగా ఏడాదిలో రూ.18కోట్ల మేర నిధులను డైరక్టర్లకు తెలియకుండా దారి మళ్లించినట్లు టీవీ9 యాజమాన్యం ఫిర్యాదు చేసింది. రవి ప్రకాశ్, మూర్తి కలిసి సుమారు రూ.18 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు డ్రా చేసినట్లు యాజమాన్యం గుర్తించింది. బోనస్, ఎక్స్‌గ్రేషియా పేరుతో సొంత ప్రయోజనాలకు వాడుకున్నారు. టీడీఎస్ పోగా.. రూ.11.74 కోట్లు విత్ డ్రా చేసినట్లు రికార్డుల్లో తేలింది. రవి ప్రకాష్‌పై సెక్షన్ 409,420,418 కింద కేసులు నమోదు చేసినట్లు డీసీపీ సుమతి తెలిపారు.