కర్ణాటక రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. సీఎం కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నుంచి ఊరట లభించడంతో మరో అడుగు మందుకు వేశారు స్వామి. ఈ పరిస్థితిలో బలనిరూపణ చేసుకునేందుకు అవకాశమివ్వాలని కోరుతున్నారు. దీనిపై ఆయన స్పీకర్ రమేష్ కుమార్‌కు అధికారికంగా లేఖ రాశారు. ముఖ్యమంత్రి కుమారస్వామి లేఖపై స్పీకర్ సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈనెల 17న కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్షకు అవకాశమున్నట్టుగా తెలుస్తోంది.
అయితే ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ ఎవరికి వారు తన ఎమ్మెల్యేలను ప్రైవేటు రిసార్టులకు తరలించే పనిలో పడ్డాయి. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుత అనిశ్చిత పరిస్థితి ఉన్న నేపథ్యంలో తనకు బలపరీక్షకు అనుమతి ఇవ్వాలని కుమారస్వామి స్పీకర్‌కు విఙ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేల రాజీనామాలు కొనసాగుతుండగానే కర్ణాటక అసెంబ్లీకి వర్షాకాల సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి.