బుధవారం నుంచి అందుబాటులోకి శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు.. పలు కీలక వివరాలను వెల్లడించిన టీటీడీ

|

Jan 19, 2021 | 6:05 AM

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఫిబ్రవరి నెలకు సంబంధిచిన కోటాను బుధవారం ఉదయం 9 గంట‌లకు తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్‌లో..

బుధవారం నుంచి అందుబాటులోకి శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు.. పలు కీలక వివరాలను వెల్లడించిన టీటీడీ
Follow us on

Special Darshan Tickets : తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఫిబ్రవరి నెలకు సంబంధిచిన కోటాను బుధవారం ఉదయం 9 గంట‌లకు తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. భక్తులు దర్శన టికెట్లతో పాటు గదులను పొందే విధంగా వెసులుబాటు కల్పిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు.

తిరుమ‌ల‌లోని ఎస్వీ మ్యూజియం అభివృద్ధిపై టీటీడీ ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి స‌మీక్ష స‌మావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫిబ్రవరి 19న తిరుమలలో రథ సప్తమి వేడుకల నిర్వాహనతోపాటు ఏర్పాట్లపై ప్రత్యేకించి చర్చించారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా సమీక్షించారు.

రథ సప్తమి రోజు కేవలం దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించాలని నిర్ణయించారు. వీటితోపాటు టాటా, టెక్ మ‌హింద్రా సంస్థ‌లు సంయుక్తంగా మ్యూజియం అభివృద్ధి ప్ర‌ణాళిక‌ల‌పై ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. భ‌క్తులు లోపలికి ప్ర‌వేశించ‌గానే స్వామివారి దివ్య‌వైభ‌వాన్ని వీక్షించి త‌రించేలా, ఆధ్యాత్మిక అనుభూతి పొందేలా ఏర్పాట్లు చేయాల‌ని ఈవో సూచించారు.