50 కోట్ల రూపాయల పాత నోట్లను మార్పిడి చేయండి

తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద ఉండిపోయిన సుమారు రూ.50కోట్ల పాత నోట్లను మార్పిడి చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు.

50 కోట్ల రూపాయల పాత నోట్లను మార్పిడి చేయండి

Edited By:

Updated on: Jul 13, 2020 | 6:13 PM

తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద ఉండిపోయిన సుమారు రూ.50కోట్ల పాత నోట్లను మార్పిడి చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఇవాళ ఢిల్లీలో నిర్మలా సీతారామన్‌ని కలిసి వైవీ సుబ్బారెడ్డి.. నోట్ల రద్దు సమయంలో భక్తులు కానుకలుగా వేసిన పాత నోట్లు ఉన్నాయని తెలిపారు. సుమారు రూ.50కోట్ల రూపాయలు విలువ చేసే పాత నోట్లు టీటీడీ వద్దనే ఉండిపోయాయని.. వాటిని మార్పిడి చేయాలని ఆయన కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్‌కి, వెనుకబడిన జిల్లాలకు నిధులను మంజూరు చేయాలని మంత్రిని కోరినట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.