శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. అమెజాన్‌లో టీటీడీ క్యాలెండర్లు, డైరీలు..

TTD Calendars: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. 2021 సంవత్సరానికి సంబంధించి ముద్రించిన క్యాలెండర్లు, డైరీలను టీటీడీ.. తమ అఫీషియల్ వెబ్‌సైట్‌ tirupatibalaji.ap.gov.inతో పాటు ఆన్‌లైన్‌లోనూ భక్తులకు అందుబాటులో ఉంచింది. అమెజాన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ ద్వారా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఆన్‌లైన్‌ ద్వారా క్యాలెండర్లు, డైరీలు బుక్ చేసుకున్నవారికి ప్యాకేజింగ్, షిప్పింగ్ ఛార్జీలు అదనంగా ఉంటాయని టీటీడీ స్పష్టం చేసింది. అలాగే టీటీడీ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకున్న విదేశాల్లోని భక్తులకు పోస్టల్ శాఖ ద్వారా […]

శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. అమెజాన్‌లో టీటీడీ క్యాలెండర్లు, డైరీలు..

Updated on: Nov 05, 2020 | 12:18 AM

TTD Calendars: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. 2021 సంవత్సరానికి సంబంధించి ముద్రించిన క్యాలెండర్లు, డైరీలను టీటీడీ.. తమ అఫీషియల్ వెబ్‌సైట్‌ tirupatibalaji.ap.gov.inతో పాటు ఆన్‌లైన్‌లోనూ భక్తులకు అందుబాటులో ఉంచింది. అమెజాన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ ద్వారా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఆన్‌లైన్‌ ద్వారా క్యాలెండర్లు, డైరీలు బుక్ చేసుకున్నవారికి ప్యాకేజింగ్, షిప్పింగ్ ఛార్జీలు అదనంగా ఉంటాయని టీటీడీ స్పష్టం చేసింది.

అలాగే టీటీడీ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకున్న విదేశాల్లోని భక్తులకు పోస్టల్ శాఖ ద్వారా డెలివరీ చేసే ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ఇక డైరీలు, క్యాలెండర్లు కొనుగోలుకు సంబంధించిన సమాచారం కోసం 0877-2264209, 9963955585 నెంబర్లను సంప్రదించాలని టీటీడీ సూచించింది. కాగా, విజయవాడ, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, న్యూఢిల్లి, ముంబయిలోని టీటీడీ సమాచార కేంద్రాలతో పాటు టీటీడీకి అనుబంధంగా ఉన్న అన్ని ఆలయాల్లోనూ క్యాలెండర్లు, డైరీలు భక్తులకు అందుబాటులో ఉంచింది.