అధికారుల ఒప్పందం త‌ర్వాతే మంత్రుల సమావేశం..

|

Sep 12, 2020 | 3:03 PM

అంతర్రాష్ట్ర ఆర్టీసీ బస్సు సర్వీసులపై తెలంగాణ రాష్ర్ట ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టాల ర‌వాణా శాఖ మంత్రులు సోమ‌వారం స‌మావేశ‌మ‌వుతార‌ని వ‌చ్చిన..

అధికారుల ఒప్పందం త‌ర్వాతే మంత్రుల సమావేశం..
Follow us on

Minister Puvvada Ajay : అంతర్రాష్ట్ర ఆర్టీసీ బస్సు సర్వీసులపై తెలంగాణ రాష్ర్ట ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టాల ర‌వాణా శాఖ మంత్రులు సోమ‌వారం స‌మావేశ‌మ‌వుతార‌ని వ‌చ్చిన వార్త‌ల‌ను మంత్రి కొట్టివేశారు. అంత‌ర్ రాష్ర్ట‌ బ‌స్సు స‌ర్వీసుల అంశంపై ఎలాంటి మంత్రుల స్థాయి స‌మావేశం లేద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. ఏపీ ర‌వాణా శాఖ మంత్రితో ఎలాంటి అధికారిక భేటీ నిర్ణ‌యం కాలేద‌ని అన్నారు. కిలోమీట‌ర్ బేసిస్‌లో అధికారుల ఒప్పందం త‌ర్వాతే మంత్రుల స్థాయి స‌మావేశం ఉంటుంద‌న్నారు స్పష్టత ఇచ్చారు. అధికారుల స్థాయి స‌మావేశాలు కొన‌సాగుతూనే ఉంటాయ‌ని మంత్రి పువ్వాడ అజ‌య్ పేర్కొన్నారు.

కాగా కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఇటీవల లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో ఇరు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు ప్రారంభమైనప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు మాత్రం ప్రారంభం కాలేదు.

దీనిపై ఇరు రాష్ట్రాల రవాణాశాఖ ఆధికారుల మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. ఇరు రాష్ట్రాల నుంచి సమానంగా సర్వీసులు నడపాలని తెలంగాణ పట్టుబడుతున్న నేపథ్యంలో నిలిచిపోయిన చర్చలను ఎలాగైనా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వాలు మరోసారి సిద్ధమవుతున్నాయి.