అమెరికా.. ఆగని హింసాకాండ.. బంకర్ లోకి వెళ్లిన అధ్యక్షుడు ట్రంప్

| Edited By: Pardhasaradhi Peri

Jun 01, 2020 | 11:05 AM

అమెరికాలో ఓ నల్లజాతీయుని హత్యకు నిరసనగా ఇంకా పెద్దఎత్తున నిరసనజ్వాలలు కొనసాగుతున్నాయి. ఏకంగా అధ్యక్షభవనం వైట్ హౌస్ వద్దే ఆందోళనకారులు..

అమెరికా.. ఆగని హింసాకాండ.. బంకర్ లోకి వెళ్లిన అధ్యక్షుడు ట్రంప్
Follow us on

అమెరికాలో ఓ నల్లజాతీయుని హత్యకు నిరసనగా ఇంకా పెద్దఎత్తున నిరసనజ్వాలలు కొనసాగుతున్నాయి. ఏకంగా అధ్యక్షభవనం వైట్ హౌస్ వద్దే ఆందోళనకారులు.. పోలీసులతో ఘర్షణలు పడుతున్నారు. బహుశా వారి దూకుడు చూసి ట్రంప్ కూడా కాస్త బెదరినట్టు ఉన్నారు. నిన్న సాయంత్రం ఆయన వైట్ హౌస్ కిందగల బంకర్ లోకి వెళ్లారు. అక్కడ సుమారు గంట సేపు గడిపి బయటకు వచ్చారు. అయితే ఆయన వెంట ఆయన భార్య మెలనియా గానీ ఇతర కుటుంబ సభ్యులు గానీ ఉన్నారా అన్న విషయం తెలియలేదు. జార్జ్ ఫ్లాడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్ ని మినియాపొలీస్ నగర పోలీసు ఒకడు మెడపై కాలితో బలంగా నొక్కడంతో జార్జ్ మరణించాడు. ఈ దారుణానికి నిరసనగా గత నెల 25 నుంచే దేశవ్యాప్తంగా అల్లర్లు, ఘర్షణలు జరుగుతున్నాయి. భారీ సంఖ్యలో ఆందోళనకారులు వైట్ హౌస్ వద్ద గుమికూడి నిరసనలకు దిగారు. వీరి ఆందోళనలను ప్రత్యక్షంగా తన భవనం లో నుంచే చూసిన ట్రంప్.. కాస్త గాభరా పడినట్టు కనిపిస్తున్నారు. ఎందుకైనా మంచిదని బంకర్ లో పరిస్థితి ఎలా ఉందొ చూసివచ్చారు. నిరసనకారులను చూసిన ట్రంప్ టీమ్ లోని వారే ఆశ్చర్యపోయారట. కాగా-15 రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్స్ ని ప్రభుత్వం సిధ్ధం చేసింది. మరో రెండు వేల మంది పోలీసులను కూడా రంగంలోకి దించడానికి సమాయత్తమైంది.