కోవిడ్ బిల్లుపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసింది అందుకేనా ? టిబెట్ లో చైనా జోక్యానికి చెక్ పెట్టేందుకేనా ?

| Edited By: Anil kumar poka

Dec 28, 2020 | 6:50 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోవిడ్ బిల్లుపై సంతకం చేయడానికి వెనుక బలమైన కారణమే ఉన్నట్టు కనిపిస్తోంది. టిబెట్ లో యూఎస్ దౌత్య కార్యాలయం ఏర్పాటు చేయడంతో బాటు టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడి ఎంపికలో చైనా జోక్యానికి చెక్ పెట్టేందుకు కూడానని తెలిసింది.

కోవిడ్ బిల్లుపై  డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసింది అందుకేనా ? టిబెట్ లో చైనా జోక్యానికి చెక్ పెట్టేందుకేనా ?
Follow us on

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోవిడ్ బిల్లుపై సంతకం చేయడానికి వెనుక బలమైన కారణమే ఉన్నట్టు కనిపిస్తోంది. టిబెట్ లో యూఎస్ దౌత్య కార్యాలయం ఏర్పాటు చేయడంతో బాటు టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడి ఎంపికలో చైనా జోక్యానికి చెక్ పెట్టేందుకు కూడానని తెలిసింది. అంటే ఈ వారసుడిని అక్కడి బౌధ్ధులే నియమించుకునేలా చూడాలని కూడా ట్రంప్ భావించారని అంటున్నారు. ఇదే సందర్భంలో టిబెట్ పాలసీ అండ్ సపోర్టింగ్ యాక్ట్-2020 ను సవరించి ఆ పీఠభూమికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు, నిబంధనల విషయంలో పరోక్షంగా తమ పాత్ర ఉండాలన్నదే ఆయన అభిమతం. ఫెడరల్ ప్రభుత్వానికి నిధులు ఇచ్చేందుకు, కరోనా వైరస్ అదుపునకు ఉద్దేశించిన కార్యక్రమాల తోడ్పాటుకు 2.3 ట్రిలియన్ డాలర్ల భారీ ప్యాకేజీ బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు.. చైనా నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ సెనెట్ ఈ బిల్లును గతవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. టిబెట్ అభివృధ్దికే కాకుండా అక్కడ చైనా కాన్సులేట్ పై ఆంక్షలు విధించేందుకు కూడా ఈ చట్టం వీలు కల్పిస్తోంది. లాసాలో అమెరికన్ దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు చైనా  అనుమతిస్తే తప్ప, అమెరికాలో చైనా దౌత్య కార్యాలయం ఏర్పాటుకు తాము కూడా అనుమతించరాదని కూడా ఇందులో పేర్కొన్నారు.

14 వ దలైలామాను చైనా వేర్పాటువాదిగా పరిగణిస్తోంది. తమ దేశం నుంచి టిబెట్ ను వేరు చేసే సెపరేటిస్ట్ గా భావిస్తోంది. కాగా టిబెట్ పాలసీ అండ్ సపోర్ట్ యాక్ట్ కింద టిబెట్ పై స్పెషల్ కో-ఆర్డినేటర్ కి ఏడాదికి పది లక్షల డాలర్లు, స్కాలర్ షిప్ ప్రొవిజన్ల కోసం 6,75000 డాలర్లు..ఇలా టిబెట్ కు పలు వరాలను అందించడానికి ఇది ఉద్దేశించినది. అక్కడి జలాలను, సహజ వనరులను చైనా దుర్వినియోగం చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది.