Trump India Visit: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాలో తన పర్యటన సందర్భంగా రెండో రోజైన మంగళవారం కూడా బిజీబిజీగా గడపనున్నారు. ఈ ఉదయం ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు, ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సాదర స్వాగతం పలికారు. అంతకుముందు ట్రంప్ గౌరవ వందనం స్వీకరించారు. రాజ్ ఘాట్ లో మహాత్ముని సమాధి వద్ద పుష్ప గుఛ్చాలుంచి శ్రధ్ధాంజలి ఘటించారు. కాగా- ట్రంప్ ఇవాళ రక్షణ, వాణిజ్య సంబంధాలపై ప్రదాయి మోడీ, ఇతర అధికారులతో చర్చలు జరపనున్నారు. హైదరాబాద్ హౌస్ లో జరగనున్న ఈ చర్చల్లో పలు ద్వైపాక్షిక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ఇండియాతో మూడు బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంటామని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.