Trump India Visit : ట్రంప్‌తో కేసీఆర్ మాటామంతి..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. విందుకు విచ్చేసిన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను, వివిధ పరిశ్రమల నుంచి వచ్చిన అతిథులను కోవింద్..ట్రంప్‌కు పరిచయం చేశారు.

Trump India Visit : ట్రంప్‌తో కేసీఆర్ మాటామంతి..

Updated on: Feb 25, 2020 | 9:43 PM

Trump India Visit :  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. విందుకు విచ్చేసిన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను, వివిధ పరిశ్రమల నుంచి వచ్చిన అతిథులను కోవింద్..ట్రంప్‌కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు ముఖ్యులతో ట్రంప్‌ దంపతులు కరచాలనం చేశారు. ఈ సమయంలో కేసీఆర్.. ట్రంప్‌తో సంభాషణ జరిపారు. ఇక విందు కోసం దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత ఉన్న వెజ్ అండ్ నాన్-వెజ్ ఐటెమ్స్‌ని సిద్దం చేశారు.  లిస్ట్‌లో ఆంధ్ర, తెలంగాణకు చెందిన వంటకాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక అంతకుముందు రాష్ట్రపతి భవన్‌కు విచ్చేసిన ట్రంప్ దంపతులకు..భారత రాష్ట్రపతి కోవింద్ దంపతులు ఆత్మీయ స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్ యొక్క ప్రాముఖ్యతను ట్రంప్ దంపతులకు వివరించారు. ఇక బుద్దుడి దంపతుల విగ్రహం వద్ద ట్రంప్, మెలానియాతో..కోవింద్ దంపతులు ఫోటో దిగారు.

ఇది కూడా చదవండి : ఎమ్మెల్యే విడదల రజనీ మరిదిపై దాడి కేసులో ఆరుగురి అరెస్టు