మళ్లీ మరణశిక్షలు అమలు: ట్రంప్ సంచలన నిర్ణయం

| Edited By:

Jul 26, 2019 | 12:57 PM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అమెరికాలో మళ్లీ మరణ శిక్షలను అమలు చేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హీనమైన నేరాలకు పాల్పడిన ఐదుగురికి ఇప్పటికే మరణశిక్షను విధించి, ఎప్పుడు అమలుచేయాలనే తేదీలను కూడా ఖరారు చేసింది. అమెరికా అటార్నీ జనరల్‌ విలియం బార్‌ ఓ ప్రకటన చేస్తూ.. నీచమైన నేరాలకు పాల్పడిన వారికి మరణ శిక్ష విధించాలని న్యాయశాఖ ఎప్పటి నుంచో గత ప్రభుత్వాలను కూడా కోరుతూ […]

మళ్లీ మరణశిక్షలు అమలు: ట్రంప్ సంచలన నిర్ణయం
Follow us on

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అమెరికాలో మళ్లీ మరణ శిక్షలను అమలు చేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హీనమైన నేరాలకు పాల్పడిన ఐదుగురికి ఇప్పటికే మరణశిక్షను విధించి, ఎప్పుడు అమలుచేయాలనే తేదీలను కూడా ఖరారు చేసింది.

అమెరికా అటార్నీ జనరల్‌ విలియం బార్‌ ఓ ప్రకటన చేస్తూ.. నీచమైన నేరాలకు పాల్పడిన వారికి మరణ శిక్ష విధించాలని న్యాయశాఖ ఎప్పటి నుంచో గత ప్రభుత్వాలను కూడా కోరుతూ వచ్చింది. చట్టాలు సరిగ్గా అమలయ్యేలా న్యాయ విభాగం చూస్తుంది. బాధితులకు, వారి కుటుంబాలకు న్యాయం చేకూర్చాల్సిన బాధ్యత ఆ విభాగంపై ఉందని తెలిపారు. మరణ శిక్షలను అమలు చేయాలంటూ జైళ్ల శాఖను విలియం ఇప్పటికే ఆదేశించారు. అమెరికాలో మరణశిక్ష అంటే మన దగ్గరలా ఉరిశిక్ష విధించకుండా, విషపూరిత మందులు ఇచ్చి నేరస్తులు చనిపోయేలా చేస్తారు.