భారత రత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత విచారం వ్యక్తం చేశారు. ప్రణబ్ మరణ వార్త పట్ల ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రణబ్ నిజమైన రాజనీతజ్ఞుడు అని ఆమె కొనియాడారు. దేశం కోసం ఆయన నిస్వార్థంగా సేవ చేశారన్నారు. ప్రణబ్‌తో దిగిన ఫోటోను తన ట్విట్టర్‌లో మాజీ ఎంపీ కవిత షేర్ చేశారు.
Saddened by the demise of Bharat Ratna Shri Pranab Mukherjee Ji ,Former President of India. A true statesman who served India selflessly. My sincere condolences to his family and loved ones in this hour of grief. pic.twitter.com/N0wBDdhX4D
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 31, 2020
ప్రణబ్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి చెబుతున్నట్లు కవిత ట్వీట్ చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఇవాళ కన్నుమూసినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో ప్రణబ్‌కు ఇటీవల బ్రెయిన్ సర్జరీ జరిగింది. అయితే డీప్ కోమాలో ఉన్న ఆయన ఇవాళ మరణించినట్లు ప్రకటించారు.