ఏపీలో టీఆర్ఎస్ ప్రచార వాహనాలు..!

తెలంగాణలో శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ వినియోగించిన వాహనాలు ఏపీలో దర్శనమిచ్చాయి. వైసీపీ ప్రచార రథాలుగా ఏపీలో నెల్లూరులోని వేదాయపాలెం పుట్టవీధిలోని ఓ మెకానిక్ షెడ్డులో టీఆర్ఎస్ వాహనాలు కనిపించించాయి. బయట ఫ్యాన్ గుర్తుకే మన ఓటు అని ఉంది. లోపల టీఆర్ఎస్ గుర్తు అయిన కారుతో పింక్ కలర్లో ఉన్న సీట్లు కనిపించాయి. బయపటి వ్యక్తులు అక్కడి రాకుండా మెకానిక్ షాపు యాజమాన్యం వారు జాగ్రత్త పడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఉపయోగించిన వాహనాలు వైసీపీ పార్టీకి […]

ఏపీలో టీఆర్ఎస్ ప్రచార వాహనాలు..!

Edited By:

Updated on: Mar 13, 2019 | 3:57 PM

తెలంగాణలో శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ వినియోగించిన వాహనాలు ఏపీలో దర్శనమిచ్చాయి. వైసీపీ ప్రచార రథాలుగా ఏపీలో నెల్లూరులోని వేదాయపాలెం పుట్టవీధిలోని ఓ మెకానిక్ షెడ్డులో టీఆర్ఎస్ వాహనాలు కనిపించించాయి. బయట ఫ్యాన్ గుర్తుకే మన ఓటు అని ఉంది. లోపల టీఆర్ఎస్ గుర్తు అయిన కారుతో పింక్ కలర్లో ఉన్న సీట్లు కనిపించాయి. బయపటి వ్యక్తులు అక్కడి రాకుండా మెకానిక్ షాపు యాజమాన్యం వారు జాగ్రత్త పడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఉపయోగించిన వాహనాలు వైసీపీ పార్టీకి చెందిన నేతలు కొన్నారని, వాటికి కలర్ మార్చుతున్నామని అక్కడున్న స్థానికులు తెలిపారు. కాగా.. వైసీపీ అధినేత జగన్ కు సీఎం కేసీఆర్ సహకరిస్తున్నారన్న ప్రచారానికి ఈ వాహనాలు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి.