Ram Pothineni: త్రివిక్రమ్‌తో సినిమాపై స్పందించిన హీరో రామ్… కానీ ప్రారంభమెప్పుడో చెప్పలేడట…

టాలీవుడ్ హీరో రామ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో సినిమా వస్తోందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వార్తను...

Ram Pothineni: త్రివిక్రమ్‌తో సినిమాపై స్పందించిన హీరో రామ్... కానీ ప్రారంభమెప్పుడో చెప్పలేడట...

Updated on: Jan 10, 2021 | 7:50 AM

టాలీవుడ్ హీరో రామ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో సినిమా వస్తోందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వార్తను అటు త్రివిక్రమ్ కానీ, ఇటు రామ్ కానీ ఎక్కడ చెప్పలేదు. దీంతో వారి ఇద్దరి సినిమా పట్టాలెక్కుతుందని ఎవరూ అనుకోలేదు. కాకపోతే త్రివిక్రమ్, రామ్ మధ్య కథా పరమైన చర్చలు జరిగాయని ఫిలిం నగర్ గుసగుసలు వినిపించాయి. అయితే ఇప్పుడు హీరో రామ్ మాటల మాంత్రికుడితో సినిమా ఉంటుందని ప్రకటించాడు.

సంక్రాంతికి రామ్ కథానాయకుడిగా, కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన రెడ్‌ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా రామ్‌ పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు. దానిలో భాగంగా రాబోయే సినిమాల గురించి సైతం తెలిపాడు. ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమా గురించి ప్రస్తావించారు. త్రివిక్రమ్‌తో గతంలో మాట్లాడానని, మా ఇద్దరి కలయికలో తర్వాత సినిమా ఉంటుందని ప్రకటించారు. అయితే అది ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేం అని రామ్ అన్నారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us