కరోనా రహిత రాష్ట్రంగా త్రిపుర..

| Edited By:

Apr 24, 2020 | 4:32 PM

కోవిద్-19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. అయితే.. కరోనా వైరస్ ను త్రిపుర రాష్ట్రం తరిమికొట్టి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఈ రాష్ట్రంలో నమోదైన రెండో కరోనా పాజిటివ్

కరోనా రహిత రాష్ట్రంగా త్రిపుర..
Follow us on

కోవిద్-19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. అయితే.. కరోనా వైరస్ ను త్రిపుర రాష్ట్రం తరిమికొట్టి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఈ రాష్ట్రంలో నమోదైన రెండో కరోనా పాజిటివ్ వ్యక్తి కోలుకోవడంతో తమ రాష్ట్రం కరోనా ఫ్రీ రాష్ట్రంగా నిలిచిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ ప్రకటించారు.

కాగా.. త్రిపురలో మొదట రెండు కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మొదటి వ్యక్తికి క్వారంటైన్ లో ఉంచి చికిత్స చేస్తే కరోనా నెగిటివ్ రావడంతో అతన్ని డిశ్చార్జ్ చేశారు. అనంతరం రెండో వ్యక్తి కూడా కరోనా నుంచి బయటపడటంతో త్రిపుర రాష్ట్రం కరోనా ఫ్రీ రాష్ట్రంగా ఏర్పడింది. త్రిపురతోపాటు గోవా, లక్షద్వీప్, డామన్ డయ్యూ, దాద్రా, నగర్ హవేలీ, సిక్కిం, నాగాలాండ్, మిజోరం ప్రాంతాలు కరోనా ఫ్రీ గా నిలిచాయి.

[svt-event date=”24/04/2020,3:57PM” class=”svt-cd-green” ]