కరోనా చికిత్సకు.. ప్రత్యేక బీమా పాలసీలు..

| Edited By:

Jul 26, 2020 | 1:32 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా చికిత్స కోసం లక్షలు వెచ్చించాల్సిందేనా? అని ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారికి బీమా కంపెనీలు

కరోనా చికిత్సకు.. ప్రత్యేక బీమా పాలసీలు..
Follow us on

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా చికిత్స కోసం లక్షలు వెచ్చించాల్సిందేనా? అని ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారికి బీమా కంపెనీలు ధీమా కలిగిస్తున్నాయి. దీని వల్ల ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజుల భారం తగ్గుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీమా తీసుకుంటున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిందని మ్యాక్స్‌బూపా ఆరోగ్య బీమా సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.

ఇన్సూరెన్స్ కంపెనీలు ఐఆర్‌డీఏ మార్గదర్శకాలను అనుసరించి కరోనా కోసం ప్రత్యేక బీమా పాలసీలను ప్రకటించాయి. ‘కరోనా కవచ్‌’, ‘కరోనా రక్షక్‌’, ‘ఆరోగ్య సంజీవనీ’ పేర వ్యక్తిగత, కుటుంబ, గ్రూపు పాలసీలను అందుబాటులోకి తెచ్చాయి. రిలయన్స్‌, ఫ్యూచర్‌ జనరల్‌ హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ వంటి కంపెనీలు గ్రూపు బీమా పాలసీలను అమలు చేస్తున్నాయి. ఓరియంటల్‌ హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌, స్టార్‌ హెల్త్‌ వంటి కంపెనీలు వ్యక్తిగత, కుటుంబ పాలసీలను అందుబాటులోకి తీసుకొచ్చాయి.

సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ‘ఆరోగ్య సంజీవనీ’ పాలసీ అమల్లోకి వచ్చింది. కరోనా వ్యాధితోపాటు వివిధ వ్యాధులకు దీని కింద చికిత్స అందించే అవకాశం ఉంది. ఈ పాలసీని అన్ని ఆరోగ్య బీమా కంపెనీలు అమలు చేయాలంటూ బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏ) ఆదేశించింది. ఇప్పటికే 29 కంపెనీలు ఈ పాలసీని అందిస్తున్నాయి. ఇది దేశమంతటా ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి వచ్చింది.

Read More:

ప్రభుత్వ ఆస్పత్రుల్లో.. అందుబాటులో.. 54 రకాల ఔషధాలు..

కరోనా బాధితుల కోసం.. నిరంతర సేవలో.. 216 అంబులెన్సులు..